Internet-Banking -safty-Tips

 Internet-Banking -safty-Tips

Banking Tips: ఇంటర్నెట్ బ్యాంకింగ్ వాడుతున్నారా? ఈ సేఫ్టీ టిప్స్ గుర్తుంచుకోండి

Banking Tips | ఆన్‌లైన్ బ్యాంకింగ్ చేస్తుంటారా? మొబైల్ బ్యాంకింగ్ (Mobile Banking) ద్వారా తరచూ లావాదేవీలు జరుపుతుంటారా? సేఫ్టీ టిప్స్ గుర్తుంచుకోకపోతే చిక్కుల్లో పడ్డట్టే.

ఇంటర్నెట్ బ్యాంకింగ్ (Internet Banking) అందుబాటులోకి వచ్చాక బ్యాంకింగ్ కార్యకలాపాలు సులువైపోయాయి. ఖాతాదారులకు ఎంతో సమయం ఆదా అవుతోంది. అయితే మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్‌లోఏమాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా, ఉన్న డబ్బులన్నీ కోల్పోవాల్సి వస్తుంది. 

ముఖ్యంగా సెక్యూరిటీ విషయంలో రాజీ పడకూడదు. ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ (Online Transactions) జరిపే సమయంలో కేర్‌ఫుల్‌గా ఉండాలి. అప్పుడే రిస్క్‌ లేకుండా పేమెంట్స్ పూర్తి చేయొచ్చు. ఇంటర్నెట్ బ్యాంకింగ్ విషయంలో పాటించాల్సిన జాగ్రత్తలేంటో తెలుసుకుందాం.

స్ట్రాంగ్ పాస్‌వర్డ్

ఇంటర్నెట్ బ్యాంకింగ్‌లో ప్రధానమైనది క్రెడెన్షియల్స్. డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నంబర్, భర్త/ భార్య పేరు వంటి వాటిని పాస్‌వర్డ్‌గా పెట్టుకోవద్దు. స్కామర్లు వీటిని సులువుగా ఊహిస్తారు. కాబట్టి, స్ట్రాంగ్ పాస్‌వర్డ్‌ పెట్టుకోవాలి. మిక్స్‌డ్ క్యారెక్టర్స్‌ కలిపి పాస్‌వర్డ్‌గా పెట్టాలి. దీన్ని తరచుగా మార్చాలి. అప్పుడే స్కామర్ల చేతిలో పడకుండా కాపాడుకోవచ్చు. 

పాస్‌వర్డ్‌ ఎంటర్ చేసే సమయంలో కాపీ పేస్ట్ చేయకూడదు. మ్యాన్యువల్‌గా ఎంటర్ చేయాలి. దీంతో పాటు పాస్‌వర్డ్‌ ఎక్కడ పడితే అక్కడ రాయకూడదు. గుర్తుతెలియని వారికి కంప్యూటర్ షేర్ చేయకపోవడమే మంచిది. 

వివరాలు చెప్పొద్ దు

ప్రతి అకౌంట్ హోల్డర్‌కి యూజర్ ఐడీ, ఐపిన్ (IPIN) ఉంటుంది. ఇది వ్యక్తిగతం. బ్యాంకు సిబ్బందితో కూడా దీనిని పంచుకోకూడదు. నెట్ బ్యాంకింగ్‌కి లాగిన్ అయ్యాక కొత్తగా జనరేట్ అయిన ఐపిన్‌ మార్చుకోవాలి. కొంత మంది బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పి ఖాతాదారులను ఏమార్చేందుకు ప్రయత్నిస్తారు. పాస్‌వర్డ్, ఓటీపీ, డెబిట్ కార్డ్ నంబర్, సీవీవీ, తదితర వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దు.

ఆ లింక్స్‌తో జాగ్రత్త

రోజూ ఎన్నో మెసేజ్‌లు, ఇమెయిల్స్ వస్తుంటాయి. వాటిల్లో కొన్ని అనుమానాస్పద లింకులు ఉంటాయి. వాటిని క్లిక్ చేయొద్దు. అనుమానాస్పద ఇమెయిల్స్‌కి రెస్పాండ్ కాకపోవడమే మంచిది. అందులో వచ్చే అటాచ్‌మెంట్లను డౌన్‌లోడ్ చేయొద్దు. దీంతో పాటు హోటళ్లు, ఎయిర్‌పోర్టులు, సైబర్ కేఫ్‌ల వంటి పబ్లిక్ వైఫై వాడుతున్న సమయంలో ఇంటర్నెట్ బ్యాంకింగ్‌కి లాగిన్ అవ్వకూడదు. 

ఫోన్ సాఫ్ట్‌వేర్‌, బ్యాంకింగ్ యాప్స్ ఎప్పటికప్పుడు అప్‌డేట్‌లో ఉంచుకోవాలి. మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. అధికారిక సైట్‌లోనే

అధికారిక వెబ్‌సైట్‌లలోనే ఇంటర్నెట్ బ్యాంకింగ్ చేయాలి. అఫీషియల్ వెబ్‌పేజీలను పోలిన సైట్లు ఎన్నో ఉంటాయి. ఆయా బ్యాంకులు అధికారిక వెబ్‌సైట్‌ల గురించి ఖాతాదారులకు తెలియజేస్తుంటాయి. వీటిలోనే లాగిన్ కావాలి. ఉదాహరణకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నెట్‌ బ్యాంకింగ్‌కి లాగిన్ కావాలంటే www.hdfcbank.com వెబ్‌సైట్‌కి వెళ్లాలి. 

ఇమెయిల్స్ లేదా ఇతర వెబ్‌సైట్లలో లింక్‌లను క్లిక్ చేసి నెట్ బ్యాంకింగ్ వెబ్‌పేజీలోకి వెళ్లకూడదు. యూఆర్ఎల్ ఎంటర్ చేసే సమయంలోనూ వెరిఫై చేసుకోవాలి. 

వెబ్‌పేజీలోని అడ్రస్ బార్‌లో ఎడమవైపున పైభాగంలో ‘లాక్’ సింబల్ ఉందో లేదో చెక్ చేయాలి. లాక్ సింబల్ ఉంటే అధికారిక పేజీ అన్నట్లు అర్థం. అదే విధంగా యూఆర్ఎల్‌లో ‘https’ అని ఉంటుంది. ‘http’ అని ఉంటే ప్రాసెస్‌ని ఆపేయాలి.

టు స్టెప్ వెరిఫికేషన్

నెట్ బ్యాంకింగ్ సెక్యూరిటీ కోసం యూజర్లు టు ఫ్యాక్టర్ అథెంటికేషన్ (2FA) ఎనేబుల్ చేసుకోవాలి. ఇలా అయితే, ఇతరులు నెట్ బ్యాంకింగ్ ఓపెన్ చేయాలని భావిస్తే రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ లేదా ఇమెయిల్‌కి ఓటీపీ లేదా అలర్ట్ మెసేజ్ వస్తుంది. వీటిని ఎంట్రీ చేస్తేనే లాగిన్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి టు ఫ్యాక్టర్ అథెంటికేషన్‌తో అకౌంట్‌ను సేఫ్‌గా ఉంచుకోవచ్చు.