Chandrayan-3-Broadcasted-live-link

 Chandrayan-3-Broadcasted-live-link

Convening of Special Assembly of students and teachers in all the schools from 5.30 PM to 6.30 PM on 23.08.23 regarding LIVE Streaming of Chandrayaan-3 landing on the moon –Instructions issued.

ఇస్రో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్-3 మరికొద్ది గంటల్లోనే జాబిల్లిపై అడుగుపెట్టనుంది. జూలై 14న ప్రయోగించిన చంద్రయాన్-3.. 45 రోజుల పాటు ప్రయాణించి బుధవారం అంటే ఆగస్టు 23న సాయంత్రం సరిగ్గా 6 గంటల 4 నిమిషాలకు చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ అడుగు పెట్టనుంది. అయితే.. ఈ ల్యాండింగ్‌ ప్రక్రియపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో.. AP సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. చంద్రయాన్‌-3 జాబిల్లిపై దిగే అద్భుతాన్ని రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికి చూపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు తగ్గట్టుగానే.. విద్యార్థుల కోసం స్కూళ్లు, కాలేజీల్లో లైవ్‌ టెలికాస్ట్ ఏర్పాటు చేయాలని అధికారులను AP ప్రభుత్వం ఆదేశించింది.

CHANDRAYAN-3 LIVE LINK OFFICIAL

ఈమేరకు డీఈవోలకు, ప్రిన్సిపల్స్‌కు స్కూల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక తెరలు, ప్రొజెక్టర్‌లను సిద్ధం చేస్తున్నారు. బుధవారం సాయంత్రం 5.20 గంటల నుంచి ఛానెళ్లలో లైవ్‌ ప్రారంభం కానుంది. సాయంత్రం సరిగ్గా 6.04 గంటలకు స్పేస్‌క్రాఫ్ట్‌ చంద్రుడిపై దిగనుండగా.. ఆ అద్బుత దృశ్యాన్ని విద్యార్థులకు లైవ్‌లో చూపించనున్నారు.

23-08-2023 సాయంత్రం 5.27 గంటల నుంచి.. చంద్రయాన్‌-3 ప్రయోగంలోని విక్రమ్ ల్యాండర్.. జాబిల్లిపైకి దిగే ప్రక్రియను ఇస్రో లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వనుంది. ఈ లైవ్.. వెబ్‌సైట్‌, యూట్యూబ్‌ ఛానల్‌, డీడీ నేషనల్‌ ఛానెళ్ల ద్వారా వీక్షించవచ్చు. దీంతో.. అన్ని విద్యాసంస్థల్లో.. సాయంత్రం 5.15 గంటల నుంచి 6.15 గంటల వరకు లైవ్ ఇవ్వనున్నారు.

Message on Chandrayaan-3 Soft-landing telecast 23-08-2023 AT 5PM 

Let’s encourage students to see the Live Landing to mark India’s Historic Mission to Moon.
Please click the link to know more: