world-ozone-day-september-16th-2023

 world-ozone-day-september-16th-2023

Ozone Day: ‘ఓజోన్‌’తోనే మానవజాతికి జీవం.. పదిలంగా కాపాడుకుందాం
World Ozone Day: : నేడు ఓజోన్ డే... ఇదీ చరిత్ర

ఈ రోజుల్లో మనం తీసుకునే ప్రతీ నిర్ణయమూ ఓజోన్ పొరను దెబ్బతీస్తోంది. భూతాపం పెరిగినా, వానలు కురవకపోయినా, అడవులు తగ్గిపోయినా, కాలుష్యం ఎక్కువైనా... ఇలాంటి అనర్థాలన్నీ ఓజోన్ పొరను దెబ్బతీసేవే. పాలపై మీగడలా... ఈ ఓజోన్ అనే వాయువు... భూమి చుట్టూ ఓ పొరలా అల్లుకొని ఉంది. ఇది భూమి నుంచీ స్ట్రాటో ఆవరణంలో... 15 నుంచీ 50 కిలోమీటర్ల మందంలో విస్తరించి ఉంది. సూర్యుడి నుంచీ వచ్చే అతి నీలలోహిత కిరణాలు డైరెక్టుగా భూమిపై పడనివ్వకుండా... ఓజోన్ పొర అడ్డుకుంటోంది. ఫలితంగా భగభగ మండే కిరణాలు మనపై పడకుండా ఉంటున్నాయి. ఆ పొరే గనక లేకపోతే... ఆ కిరణాలు డైరెక్టుగా భూమిపై పడి... మొత్తం ప్రాణికోటి చనిపోయేదే. సమస్యేంటంటే... పెరుగుతున్న భూతాపం వల్ల నానాటికీ ఓజోన్ వాయువు తగ్గిపోతోంది.

1980లో మొదటిసారి ఓజోన్ పొరకు కన్నం పడిన విషయాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. అందువల్ల భూమిపై డైరెక్టుగా సూర్యకిరణాలు పడిపోతున్న విషయం బయటపడింది. ఇలాగే పొర విచ్ఛిన్నం అవుతూ పోతే... కోట్ల మంది ప్రజలు, జంతువులు, పక్షులు, చెట్లు అన్నిటిపైనా వ్యతిరేక ప్రభావం పడుతుంది. చర్మంపై తీవ్రమైన సూర్యకిరణాలు పడి... కేన్సర్ వంటి రోగాలు వచ్చే ప్రమాదం ఉంది. అంతేకాదు... పిల్లలు పుట్టే అవకాశాలు కూడా తగ్గిపోతాయి.

ఓజోన్ కోసం సెప్టెంబర్ 16 : ఓజోన్ అంటే ఏంటో, దాన్ని ఎలా రక్షించుకోవాలో తెలుసుకోవడం కోసం ఏటా సెప్టెంబర్ 16న అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినం జరుపుతున్నారు. ఓజోన్ పొరను దెబ్బతీస్తున్న స్ప్రేలు, పొలాల్లో చల్లుతున్న ఎరువులు, క్రిమి సంహారాలు, ఫ్రిజ్‌లు, కార్లపై వేస్తున్న కలర్స్, క్లోరో ఫ్లోరో కార్బన్ల వంటి వాటి వాడకాన్ని ఆపేయాలని 1987లోనే నిర్ణయం తీసుకున్నా... ఇప్పటికీ అది అమలవ్వట్లేదు. ఫలితంగా ఓజోన్ పొర దెబ్బతింటూనే ఉంది.

ఓజోన్ కోసం ఏం చెయ్యాలి :

1.క్లోరో ఫ్లోరో కార్బన్ల వాడకాన్ని నిషేధించాలి. నిషేధం పక్కాగా అమలయ్యేలా చెయ్యాలి.

2. భూతాపాన్ని తగ్గించేందుకు వీలయ్యే అన్ని చర్యలూ చేపట్టాలి.

3. మొక్కలు, చెట్లూ పెంచాలి. అడవుల నరికివేతను అడ్డుకోవాలి.

4. పర్యావరణాన్ని రక్షించే చర్యలు తీసుకోవాలి. చెట్లు నరికే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఇందుకోసం బలమైన చట్టాలు తేవాలి.

5. అపార్ట్‌మెంట్లు, షాపింగ్ మాళ్లూ నిర్మించేటప్పుడే... 33 శాతం మొక్కలు, చెట్లు పెంచేందుకు ప్లేస్ ఉండేలా నిబంధనలు తేవాలి

6. సంప్రదాయ ఇంధన వనరుల స్థానంలో సోలార్ విద్యుత్ వాడకాన్ని పెంచడం ద్వారా... భూతాపాన్ని తగ్గిస్తూ... ఓజోన్ పొరను కాపాడేందుకు వీలవుతుంది.

సూర్యుడి నుంచి వచ్చే అతినీల లోహిత కిరణాల నుంచి భూమిని కాపాడే కవచం ఓజోన్ పొర. మూడు పరమాణువులతో కూడిన ఆక్సిజన్ అణువైన ఓజోన్(O3) వాయు రూపంలో, లేత నీలం రంగులో ఉంటోంది. జీవ మనుగడ ప్రారంభమైనప్పటి నుంచి భూమికి రక్షణ కల్పిస్తూ వస్తున్న ఈ పొరకు ఇప్పుడు మనమే తూట్లు పొడస్తున్నాం. అడవులను నరికేయడం, కాలుష్యం పెరగడం వల్ల ఓజోన్ వాయువు రోజు రోజుకు తగ్గిపోతోంది. దీని వల్లనే భూతాపం పెరగడం, వానలు కురవకపోవడం వంటి అనర్థాలను ఇప్పుడు మనం ఎదుర్కొంటున్నాం.

అయితే ఓజోన్ పొర క్షీణిస్తోందని సరిగ్గా 39ఏళ్ల క్రితం 1982లో పర్యావరణ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీంతో భవిష్యత్‌లో జీవకోటికి పెద్ద ప్రమాదం తలెత్తే అవకాశం ఉందని గమనించిన ఐక్యరాజ్యసమితి, ఓజోన్ సంరక్షణ కోసం ప్రపంచదేశాలను ఏకం చేసింది. ఆ తరువాత 1987, సెప్టెంబర్ 16న ఓజోన్ సంరక్షణ రోజు రోజుగా ఖరారు చేసింది. ఆపై ప్రతి సంవత్సరం ఈ రోజున ఒక్కో నినాదంతో ప్రచారం చేస్తూ ఓజోన్ పొరపై అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ సంవత్సరం ‘32 ఇయర్స్ అండ్ హీలింగ్’(గాయం మానుతోంది) అనే నినాదాన్ని తెరపైకి తీసుకొచ్చారు.

పుంజుకుంటోన్న ఓజోన్..? కాగా 2018లో ఓ సంస్థ చేసిన స్టడీలో.. 2000 సంవత్సరం నుంచి కొన్ని ప్రాంతాల్లో ఓజోన్‌ 1 నుంచి 3 శాతం మేర తిరిగి పుంజుకుంటోందని తేలింది. అంతేకాకుండా కొన్ని చర్యలు తీసుకుంటే 2030లో ఉత్తర ధ్రువంలో.. 2050కు దక్షిణ ధ్రువంలో.. 2060కు పోలార్ ప్రాంతాల్లో పూర్తిగా ఓజోన్‌ను రక్షించుకునే అవకాశం ఉందని ఆ స్టడీ తెలిపింది.

ఓజోన్ దెబ్బ తింటే కలిగే నష్టాలు ఓజోన్ దెబ్బ తినడం వలన కేవలం మనుషులకే కాదు భూమి మీద నివసిస్తున్న జంతువులు, పక్షులు, చెట్లు అన్నింటికి ప్రమాదమే. ఆ పొర లేకపోతే సూర్యుడి నుంచి వెలువడే తీవ్రమైన అతినీల లోహిత కిరణాలు మనమీద పడి కేన్సర్ రావొచ్చు. అంతేకాదు సూర్యుడి నుంచి పడే కిరణాలను తట్టుకునే శక్తి మనకు ఉండదు కాబట్టి పలు రకాల రోగాల బారిన పడే అవకాశం ఉంది. వర్షాలు వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి.

ఓజోన్‌ను రక్షించుకోవాలంటే ఏం చేయాలి? చెట్లను పెంచాలి. అడవుల నరికివేతను అడ్డుకోవాలి. క్లోరో ఫ్లోరో కార్బన్ల వాడకాన్ని నిషేధించాలి. సంప్రదాయ ఇంధన వనరుల స్థానంలో సోలార్ విద్యుత్ వాడకాన్ని పెంచాలి. కాలుష్యాన్ని తగ్గించేలా చర్యలు తీసుకోవాలి. పంటల్లో రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించాలి.