APPSC DL Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్, 240 డీఎల్ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ
ముఖ్యమైన తేదీలు..
➥ నోటిఫికేషన్ వెల్లడి: 30.12.2023.
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 24.01.2024.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 13.02.2024. (11:59)
APPSC DL Notification: ఏపీలోని డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ డిసెంబరు 30న ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసింది.
APPSC DL Recruitment 2023: ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు ప్రభుత్వం కొత్త సంవత్సర కానుకగా శుభవార్త వినిపించింది. ఈ మేరకు రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలల్లో 240 లెక్చరర్ (DL Posts) పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ (APPSC) డిసెంబరు 30న ప్రాథమిక నోటిఫికేషన్ (APPSC DL Notification) విడుదల చేసింది. విద్యార్హత, వయసు తదితర వివరాలతో పూర్తిస్థాయి నోటిఫికేషన్ దరఖాస్తు ప్రారంభ సమయానికి అందుబాటులోకి రానుంది. ఈ పోస్టుల భర్తీకి జనవరి 24 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. సంబంధిత విభాగంలో పీహెచ్‌డీ లేదా నెట్/స్లెట్ అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతగల అభ్యర్థులు ఫిబ్రవరి 13 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. రాతపరీక్ష, కంప్యూటర్ ప్రొఫీషియన్సీ ఆధారంగా ఎంపికచేస్తారు.
వివరాలు..
డిగ్రీ లెక్చరర్ (DL) పోస్టులు
ఖాళీల సంఖ్య: 240.
➥ బోటనీ: 20 పోస్టులు
➥ కెమిస్ట్రీ: 26 పోస్టులు
➥ కామర్స్: 40 పోస్టులు
➥ కంప్యూటర్ అప్లికేషన్స్: 49 పోస్టులు
➥ కంప్యూటర్ సైన్స్: 48 పోస్టులు
➥ ఎకనామిక్స్: 15 పోస్టులు
➥ హిస్టరీ: 15 పోస్టులు
➥ మ్యాథమెటిక్స్: 25 పోస్టులు
➥ ఫిజిక్స్: 11 పోస్టులు
➥ పొలిటికల్ సైన్స్: 21 పోస్టులు
➥ జువాలజీ: 20 పోస్టులు
ఇంగ్లీష్ : 05 పోస్టులు
మైక్రోబయాలజీ 04 పోస్టులు
తెలుగు : 07 పోస్టులు
అర్హతలు: సంబంధిత విభాగంలో పీహెచ్‌డీ లేదా నెట్/స్లెట్ అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
వయోపరిమితి: 18 - 42 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు; దివ్యాంగులకు 10 సంవత్సరాలు; ఎక్స్-సర్వీస్‌మెన్/ఎన్‌సీసీ అభ్యర్థులకు వయసు ఆధారంగా 3 సంవత్సరాలు, రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు 5 సంవత్సరాలు, తాత్కాలిక ఉద్యోగులకు 3 సంవత్సరాల వరకు వరకు వయోసడలింపు వర్తిస్తుంది.
ONLINE APPLICATION LINK CLICK HERE
APPSC OFFICIAL WEBSITE LINK CLICK HERE
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: రాతపరీక్ష, కంప్యూటర్ ప్రొఫీషియన్సీ ఆధారంగా ఎంపికచేస్తారు.
రాతపరీక్ష విధానం: మొత్తం 450 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. రాతపరీక్షలో మొత్తం రెండు పేపర్లు (పేపర్-1, పేపర్-2) ఉంటాయి. ఇందులో పేపర్-1: జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ - 150 ప్రశ్నలు- 150 మార్కులు- 150 నిమిషాలు; పేపర్-2 అభ్యర్థికి సంబంధించిన సబ్జెక్టు - 150 ప్రశ్నలు- 300 మార్కులు- 150 నిమిషాలు ఉంటాయి. పేపర్-1లో ఒక్కో ప్రశ్నకు ఒకమార్కుకాగా.. పేపర్-2లో ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులు కేటాయించారు. ఇక ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతు మార్కులు కోత విధిస్తారు.
కంప్యూటర్ ప్రొఫీషియన్సీ టెస్ట్: మొత్తం 100 మార్కులకు కంప్యూటర్ ప్రొఫీషియన్సీ టెస్ట్ నిర్వహిస్తారు. ఆఫీస్ ఆటోమేషన్, కంప్యూటర్ వినియోగం, కంప్యూటర్ సాఫ్ట్‌వేర్‌లకు సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం 60 నిమిషాలు. కనీసం అర్హత మార్కులను ఓసీలకు 40గా, బీసీలకు 35గా, ఎస్సీ-ఎస్టీ-దివ్యాంగులకు 30 మార్కులుగా నిర్ణయించారు.