general-insurance-corporation-jobs-scale-1-officers

 general-insurance-corporation-jobs-scale-1-officers
GICRE: జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌లో 85 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు
ముంబయిలోని జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా- జీఐసీఆర్ఈ శాఖల్లో రెగ్యులర్ ప్రాతిపదికన అసిస్టెంట్ మేనేజర్ ఖాళీల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ముంబయిలోని జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా- జీఐసీఆర్ఈ శాఖల్లో రెగ్యులర్ ప్రాతిపదికన అసిస్టెంట్ మేనేజర్ ఖాళీల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 85 పోస్టులను భర్తీ చేయనున్నారు. కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు జనవరి 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

వివరాలు..

మొత్తం ఖాళీలు: 85

* ఆఫీసర్‌- అసిస్టెంట్ మేనేజర్ కేడర్‌ (స్కేల్ I): 85 

పోస్టుల కేటాయింపు: జనరల్- 35, ఎస్సీ- 12, ఎస్టీ- 6, ఓబీసీ- 26, ఈడబ్ల్యూఎస్‌- 6, పీడబ్ల్యూడీ- 3.

⏩ హిందీ: 01 

అర్హత: జనరల్ & ఓబీసీ అభ్యర్థులు కనీసం 60%, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 55% మార్కులతో ఆంగ్లంతో పాటు హిందీ ఒక సబ్జెక్ట్‌గా పోస్ట్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులై ఉండాలి. ట్రాన్స్‌లేషన్‌లో పని అనుభవం ఉండాలి.

⏩ జనరల్: 16 

అర్హత: జనరల్ & ఓబీసీ అభ్యర్థులు కనీసం 60%, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 55% మార్కులతో ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి. పోస్ట్ గ్రాడ్యుయేషన్/ఎంబీఏ కలిగి ఉండాలి

⏩ స్టాటిస్టిక్స్: 06 

అర్హత: జనరల్ & ఓబీసీ అభ్యర్థులు కనీసం 60%, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 55% మార్కులతో స్టాటిస్టిక్స్‌లో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కలిగి ఉండాలి. 

⏩ ఎకనామిక్స్: 02 

అర్హత: జనరల్ & ఓబీసీ అభ్యర్థులు కనీసం 60%, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 55% మార్కులతో ఎకనామిక్స్/ఎకనామెట్రిక్స్‌లో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కలిగి ఉండాలి. 

⏩ లీగల్: 07 

అర్హత: జనరల్ & ఓబీసీ అభ్యర్థులు కనీసం 60%, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 55% మార్కులతో న్యాయవాదిగా నమోదు చేసుకునేందుకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాచే గుర్తించబడిన న్యాయశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎల్ఎల్ఎం/అనుభవం/సివిల్/సైబర్ కలిగి ఉండాలి.   

⏩ హెచ్‌ఆర్: 06 

అర్హత: జనరల్ & ఓబీసీ అభ్యర్థులు కనీసం 60%, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 55% మార్కులతో ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ (హెచ్‌ఆర్ఎం/ పర్సనల్ మేనేజ్‌మెంట్). 

⏩ ఇంజినీరింగ్: 11(సివిల్ - 2, ఏరోనాటికల్ - 2, మెరైన్- 1, పెట్రోకెమికల్- 2, మెటలర్జీ- 2, వాతావరణ శాస్త్రవేత్త- 1, రిమోట్ సెన్సింగ్/ జియో ఇన్ఫర్మేటిక్స్/జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్-1)

అర్హత: జనరల్ & ఓబీసీ అభ్యర్థులు కనీసం 60%, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 55% మార్కులతో సివిల్/ఏరోనాటికల్/మెరైన్/పెట్రోకెమికల్/మెటలర్జీ/మెటియోరాలజిస్ట్/రిమోట్ సెన్సింగ్/జియోఇన్ఫర్మేటిక్స్/జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్‌లో బ్యాచిలర్ డిగ్రీ (బీఈ/బీటెక్) ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత స్ట్రీమ్‌లో ఎంఈ/ఎంటెక్/ఎంఎస్/అనుభవం ఉండాలి.

⏩ ఐటీ: 09 

అర్హత: జనరల్ & ఓబీసీ అభ్యర్థులు కనీసం 60%, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 55% మార్కులతో బీఈ(సీఎస్ఈ)/బీఈ(ఐటీ)/బీఈ(ఈసీఈ)/బీఈ(ఈటీసీ)/
బీటెక్(సీఎస్ఈ) /బీటెక్(ఐటీ )/బీటెక్(ఈసీఈ)/బీటెక్(ఈటీసీ) ఉత్తీర్ణులై ఉండాలి. లేదా జనరల్ & ఓబీసీ అభ్యర్థులు కనీసం 60%, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 55% మార్కులతో  ఆర్ట్స్/సైన్స్/కామర్స్/వ్యవసాయం/మేనేజ్‌మెంట్/ఇంజనీరింగ్/బీఈ(సీఎస్ఈ)/బీఈ(ఐటీ)/బీఈ(ఈసీఈ)/బీఈ(ఈటీసీ)/బీటెక్ (సీఎస్ఈ)/బీటెక్(ఐటీ)/బీటెక్(ఈసీఈ)/బీటెక్(ఈటీసీ) లేదా ఎంసీఏ. పోస్ట్ గ్రాడ్యుయేషన్/సంబంధిత రంగాలలో IT ప్రాజెక్ట్‌లలో అనుభవం ఉండాలి.

⏩ యాక్చువరీ: 04 

అర్హత: జనరల్ & ఓబీసీ అభ్యర్థులు కనీసం 60%, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 55% మార్కులతో మ్యాథ్స్/స్టాటిస్టిక్స్‌తో గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యాక్చువరీస్ సొసైటీ ఆఫ్ ఇండియా లేదా ఇన్‌స్టిట్యూట్ మరియు ఫ్యాకల్టీ ఆఫ్ యాక్చురీస్‌లో కనీసం 7 పేపర్లు ఉత్తీర్ణులై ఉండాలి. లండన్‌లో CS2 తప్పనిసరి.

⏩ ఇన్సూరెన్స్: 17 

అర్హత: జనరల్ & ఓబీసీ అభ్యర్థులు కనీసం 60%, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 55% మార్కులతో ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ/డిప్లొమా, జనరల్ ఇన్సూరెన్స్/ రిస్క్ మేనేజ్‌మెంట్/ లైఫ్ ఇన్సూరెన్స్/ ఎఫ్III/ ఎఫ్‌సీII కలిగి ఉండాలి. 

⏩ మెడికల్(ఎంబీబీఎస్): 02 

అర్హత: జనరల్ & ఓబీసీ అభ్యర్థులు కనీసం 60%, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 55% మార్కులతో కనీసం ఎంబీబీఎస్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. 

⏩ హైడ్రాలజిస్ట్: 01 

అర్హత: జనరల్ & ఓబీసీ అభ్యర్థులు కనీసం 60%, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 55% మార్కులతో బీఎస్సీ(హైడ్రాలజీ) ఉత్తీర్ణులై ఉండాలి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కలిగి ఉండాలి. 

⏩ జియోఫిజిసిస్ట్: 01 

అర్హత: జనరల్ & ఓబీసీ అభ్యర్థులు కనీసం 60%, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 55% మార్కులతో బీఎస్సీ(జియోఫిజిక్స్ లేదా అప్లైడ్ జియోఫిజిక్స్‌) ఉత్తీర్ణులై ఉండాలి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కలిగి ఉండాలి. 

⏩ అగ్రికల్చర్ సైన్స్: 01

అర్హత: జనరల్ & ఓబీసీ అభ్యర్థులు కనీసం 60%, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 55% మార్కులతో బీఎస్సీ(అగ్రికల్చర్ సైన్స్) ఉత్తీర్ణులై ఉండాలి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కలిగి ఉండాలి. 

⏩ నాటికల్ సైన్స్: 01

అర్హత: జనరల్ & ఓబీసీ అభ్యర్థులు కనీసం 60%, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 55% మార్కులతో నాటికల్ సైన్స్‌లో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి. పోస్ట్ గ్రాడ్యుయేషన్/సెయిలింగ్ అనుభవం (సీ-టైమ్).

వయోపరిమితి:  01.10.2023 నాటికి 21 - 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

దరఖాస్తు ఫీజు: రూ.1,000. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 

* అవసరమైన నైపుణ్యాలు:

సాఫ్ట్‌వేర్ డెవలపర్లు: SAP HANAలో C++ లేదా C# లేదా.Net లేదా Java లేదా JavaScript లేదా Python లేదా SAP లేదా ABAP వంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లపై బాగా పట్టు ఉండాలి. 

నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్: డీప్ ప్యాకెట్ ట్రేసింగ్, నెట్‌వర్క్ ట్రబుల్ షూటింగ్ మరియు Nmap, putty, Linux, Cisco IOS కమాండ్‌లు వంటి సాధనాలతో బాగా పట్టు ఉండాలి. 

సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్: Linux, Power Shell, VB స్క్రిప్ట్, SQL ప్రశ్నల కోసం సర్వర్ ఆర్కిటెక్చర్/OS/DB, డేటా సెంటర్ కార్యకలాపాలు మరియు సిస్టమ్ మేనేజ్‌మెంట్ మరియు OS కమాండ్‌లలో బాగా పట్టు ఉండాలి. 

ఇన్ఫర్మేషన్ సెక్యురిటి ఆఫీసర్: ఎథికల్ హ్యాకింగ్ కోర్సులు, ఐటీ సెక్యూరిటీ థ్రెట్స్ & మెకానిజమ్స్, హ్యాకింగ్, స్పూఫింగ్ మొదలైనవి.

పే స్కేల్: నెలకు రూ.50,925- 96,765.

ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

పరీక్ష విధానం..

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: రాజమండ్రి, విజయవాడ, హైదరాబాద్, కరీంనగర్.

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 23.12.2023.

➥ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 12.01.2024.

➥ దరఖాస్తు ఫీజు చెల్లింపు తేదీలు: 23.12.2023 నుంచి 12.01.2024 వరకు.

➥ ఆన్‌లైన్ పరీక్ష తేదీ: ఫిబ్రవరి 2024.