Pariksha Pe Charcha 2024-january-29th-details

 Pariksha Pe Charcha 2024-january-29th-details
Pariksha Pe Charcha 2024: పరీక్షల భయమా? ప్రధాని మోదీతో ‘పరీక్షా పే చర్చ’కు తేదీ ఖరారు, ఎప్పుడంటే?
విద్యార్థుల్లో పరీక్షల భయాన్ని పోగొట్టేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఏటా నిర్వహించే పరీక్షా పే చర్చ కార్యక్రమాన్ని జనవరి 29న నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ జనవరి 13న ఒక ప్రకటనలో వెల్లడించింది.
Pariksha Pe Charcha Schedule: విద్యార్థుల్లో పరీక్షల భయాన్ని పోగొట్టేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఏటా నిర్వహించే పరీక్షా పే చర్చ కార్యక్రమానికి తేదీ ఖరారైంది. జనవరి 29న విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో ప్రధాని ముఖాముఖి చర్చిస్తారని కేంద్ర విద్యాశాఖ జనవరి 13న ఒక ప్రకటనలో వెల్లడించింది. పరీక్షల సమయం దగ్గరపడుతున్న ప్రస్తుత సమయంలో.. విద్యార్థులు ప్రిపరేషన్‌పై పూర్తిగా దృష్టిసారించలేక ఒత్తిడి, భయానికి లోనవుతారు. ఈ సందర్భంగా విద్యార్థుల్లో పరీక్షల భయాన్ని పోగొట్టేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఏటా నిర్వహించే 'పరీక్షా పే చర్చ'(Pariksha Pe Charcha) కార్యక్రమాన్ని రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ ఏఢాది దాదాపు 2 కోట్ల మందికి పైగా విద్యార్థులు ఇందులో పాల్గొననున్నారు. అధికారిక వెబ్‌సైట్‌లో పోటీల ద్వారా ఎంపికైన సుమారు 2,050 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు తల్లిదండ్రులకు పీపీసీ కిట్‌లను బహుమతిగా అందజేయనున్నట్టు అధికారులు తెలిపారు. 
పరీక్షా పే చర్చ కార్యక్రమానికి గతేడాదితో పోలిస్తే 14.93 లక్షల మంది ఉపాధ్యాయులు, 5.69 లక్షల మంది తల్లిదండ్రులు అధికంగా హాజరుకానున్నారు. 6వ నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థులు చర్చలో పాల్గొననున్నారు. న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్, ఐటీపీవో, భారత్ మండపం టౌన్‌హాల్‌లో జనవరి 29న ఉదయం 11 గంటల నుంచి కార్యక్రమం ప్రారంభంకానుంది. దీని చర్చ ద్వారా మోదీ విద్యార్థుల్లో పరీక్షల భయాన్ని, ఒత్తిడిని పోగొట్టి, పలు అంశాలపై విద్యార్థులతో ముచ్చటిస్తారు. ఈ కార్యక్రమంలో పరీక్షల ఒత్తిడిని ఎలా అధిగమించాలనే పలువురు విద్యార్థుల ప్రశ్నలకు మోదీ తనదైన రీతిలో సమాధానం ఇస్తారు. 
పరీక్షల సమయంలో విద్యార్థులు ఒత్తిడి నుంచి బయటపడి విజయం సాధించేందుకు, వారిని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తోంది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థుల మధ్య ఇంటరాక్షన్ జరుగుతుంది.వారికి పీఎం మోదీని కలవడానికి, సంభాషించడానికి అవకాశం కల్పిస్తారు. ప్రతి సంవత్సరం 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు పాఠశాల విద్యార్థుల కోసం పరీక్షా పే చర్చా కార్యక్రమం నిర్వహిస్తారు. కాగా జనవరి 12 రాత్రి 7 గంటల వరకు దేశవ్యాప్తంగా 1.95కోట్ల మందికి పైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. 6వ తరగతి నుంచి 12వ తరగతి విద్యార్థులతోపాటు 14.93 లక్షల మంది ఉపాధ్యాయులు, 5.69 లక్షల మందికిపైగా తల్లిదండ్రులు రిజిస్టర్ చేసుకున్నారు.
ఈ పరీక్షా పే చర్చ కార్యక్రమాన్ని తొలిసారి ప్రధాని మోదీ 2018 ఫిబ్రవరి 16న నిర్వహించిన విషయం తెలిసిందే. విద్యార్థులు ఒత్తిడిని జయించి పరీక్షలను ఎలా రాయాలి.. భయాందోళనను దూరం చేసి ఎలా సన్నద్ధమవ్వాలి అనే విషయాలపై ప్రధాని మోదీ విద్యార్థులకు పలు సలహాలు సూచనలు చేస్తారు. దాంతోపాటు దేశవ్యాప్తంగా త్వరలో జరుగనున్న బోర్డు పరీక్షల్లో రాణించేందుకు చిట్కాలను కూడా ప్రధాని మోదీ విద్యార్థులతో పంచుకుంటారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొనే ఈ కార్యక్రమాన్ని.. స్వయం ప్రభా యొక్క 32 ఛానెళ్లతోపాటు దూరదర్శన్, వివిధ ప్రభుత్వ వేదికల ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి.
యువతకు ఒత్తిడి లేని వాతావరణాన్ని కల్పించేందుకు ప్రధాని మోదీ ‘ఎగ్జామ్ వారియర్స్’ పుస్తకం రచించిన సంగతి తెలిసిందే. ఈ పుస్తకంలో  ప్రధాన మంత్రి ఒత్తిడి లేని ప‌ద్ధతిలో బోర్డు ప‌రీక్షలు, ప్రవేశ ప‌రీక్షల‌ను ఛేదించడానికి చిట్కాలను పంచుకున్నారు. పరీక్షా పే చర్చా-2024 అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, ప్రధాని నరేంద్ర మోదీ మార్గదర్శక, అత్యధికంగా అమ్ముడైన పుస్తకం ఎగ్జామ్ వారియర్స్. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజాన్ని ఒకచోట చేర్చి, విద్యార్థుల ప్రత్యేక వ్యక్తిత్వాన్ని గుర్తించే వాతావరణాన్ని పెంపొందించడమే ఈ పుస్తకం ప్రధాన లక్ష్యంగా ఉంది. తమను తాము పూర్తిగా వ్యక్తీకరించడానికి ఇదివేదిక అవుతుంది. ఈ కార్యక్రమం చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది. ఈ పుస్తకం ద్వారా, ప్రధాన మంత్రి విద్యకు సంబంధించిన కొత్త విధానాన్ని వివరించారు. విద్యార్థుల జ్ఞానం, సమగ్ర అభివృద్ధికి ప్రాథమిక ప్రాముఖ్యత ఇవ్వబడుతుంది. మితిమీరిన ఒత్తిడి, ఒత్తిడితో పరీక్షలను జీవన్మరణ పరిస్థితిగా మార్చకుండా సరైన దృక్పథంలో ఉంచాలని ప్రధాన మంత్రి ప్రతి ఒక్కరినీ కోరారు. 
PARIKSHA PE CHARCHA JANUARY 2024 REGISTRATION LINK CLICK HERE