ap-dsc-2024-notification-details

AP DSC 2024 లో మొత్తం 6100 ఖాళీలకు గాను ఫైనల్ చేసిన ZP/MPP, Govt and Mpl మ్యానేజ్మెంట్ లలో ఖాళీల వివరాలు విడుదల చేసిన విద్యాశాఖ*

✍️ఉపాధ్యాయ నియాకాలలో రెండు సంవత్సరాల పాటు అప్రంటీస్ విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టి D.S.C.-2024  Notification విడుదల. అప్రంటీస్  కాలంలో గౌరవ వేతనం  వివరాలు.

కొత్త టీచర్లకు ఇకపై శాలరీలు ఇలా....*

ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి 12 ఏళ్ల క్రితం రద్దయిన అప్రెంటిస్‌షిప్‌ విధానమే మళ్లీ అమల్లోకి వచ్చింది. డీఎస్సీ-2024 ద్వారా ఇకపై ఎంపికయ్యే టీచర్లు రెండేళ్లపాటు అప్రెంటిస్‌షిప్‌ చేయాల్సి ఉంటుంది.

అప్రెంటిస్‌షిప్‌ వ్యవధిలో టీచర్లకు గౌరవ వేతనం ఇస్తారు. ఈసారి డీఎస్సీ ద్వారా 6,100 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు తొలి ఏడాది ఆయా కేటగిరిల్లోని బేసిక్‌లో 50 శాతం, రెండో ఏడాది 60 శాతం గౌరవవేతనం ఇస్తారు. అప్రెంటిస్‌షిప్‌ పూర్తయ్యాక రెగ్యులర్‌ స్కేల్‌ ఇస్తారు. అప్రెంటిస్‌షిప్‌ సమయంలో ఇంటర్నేషనల్‌ బకలారియెట్‌ (ఐబీ) కరిక్యులమ్‌, పెడగాజీ, బోధనలో డిజిటల్‌ టెక్నాలజీ అమలు, టోఫెల్‌లాంటి మదింపులో నిపుణత, ఆంగ్లమాధ్యమం బోధించడంలో నిపుణతపై శిక్షణ అందిస్తారు.

అప్రెంటిస్‌షిప్‌ సమయంలో కొత్త టీచర్లకు ఇవ్వనున్న శాలరీ.. ఔట్ సోర్సింగ్ సేవల సిబ్బందికి ఇచ్చే గౌరవ వేతనానికి కొంచెం అటుఇటుగానే ఉంటుంది.

*ప్రస్తుతం సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్జీటీ) బేసిక్‌ రూ.32,670గా ఉంది. ఇందులో 50 శాతమంటే రూ.16,335 తొలి ఏడాదిలో ఇస్తారు. రెండో ఏడాదిలో రూ.19,602 ఇస్తారు. స్కూల్‌అసిస్టెంట్లు, టీజీటీలకు రూ.22,285, రూ.26,742 చొప్పున అందిస్తారు. పీజీటీలకు మొదటి ఏడాది రూ.24,220, రెండో ఏడాది రూ.29,064 గౌరవ వేతనం(New Teachers Salaries) అందుతుంది.*

ఈసారి డీఎస్సీ ద్వారా 6,100 పోస్టులను భర్తీ చేయనున్నారు. పాఠశాల విద్యాశాఖ పరిధిలోని యాజమాన్యాల్లో ఎస్జీటీ 2 వేలు, స్కూల్‌ అసిస్టెంట్లు 2,060, ఆదర్శ పాఠశాలల్లో ప్రిన్సిపళ్లు 15, పీజీటీలు 23, టీజీటీ 248, ఏపీ రెసిడెన్షియల్‌ స్కూళ్లలో ప్రిన్సిపళ్లు 4, పీజీటీలు 53, టీజీటీ 118 పోస్టులున్నాయి. సాంఘిక సంక్షేమంలో టీజీటీ 386, బీసీ సంక్షేమ ప్రిన్సిపళ్లు 23, పీజీటీ 81, టీజీటీ 66, గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో ఎస్జీటీ 226, టీజీటీ 280, గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్‌లో పీజీటీ 58, టీజీటీ 446, వ్యాయామ ఉపాధ్యాయులు 13 పోస్టులు ఉన్నాయి

✍️6,100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి AP DSC 2024 నోటిఫికేషన్, ఖాళీల ప్రకటన్. ఫిబ్రవరి 12 నుండి ఆన్లైన్ రిజిస్ట్రేషన్.

*🅰️🅿️ DSC-2024 సమాచారం*

*నోటిఫికేషన్ తేదీ: 07.02.2024*

*పరీక్షా స్వరూపం: కంప్యూటర్ బేస్డ్, ఆబ్జెక్టివ్ టెస్ట్*

*పరీక్ష ఫీజు చెల్లించేందుకు ప్రారంభ తేదీ: 12.02.2024*

*పరీక్ష ఫీజు చెల్లించేందుకు చివరి తేదీ: 21.02.2024*

*అప్లికేషన్స్ సబ్మిట్ చేయడానికి ప్రారంభ తేది : 12.02.2024*

*అప్లికేషన్స్ సబ్మిట్ చేయడానికి చివరి తేది : 22.02.2024*

*హాల్ టికెట్లను జారీ చేయు తేదీ: 05.03.2024*

*పరీక్ష నిర్వహణ తేదీలు : 15.03.2024 నుంచి 30.03.2024 వరకు*

*తుది ఫలితాల ప్రకటన: 07.04.2024*

👉పూర్తి వివరాలు, జిల్లాల వారీగా, పోస్టుల వారీగా ఖాళీలు Total: 6100

AP DSC 2024 OFFIXIAL WEBSITE LINK CLICK HERE



Vacancies: 4060 [In ZP/MP/MPL/Govt Management]

▪️SGT: 2000

▪️SA 1st: 231

▪️SA 2nd: 269

▪️SA Eng: 422

▪️SA Mat: 356

▪️SA PS : 113

▪️SA Bio: 167

▪️SA SS: 104

▪️SA PE: 398

▪️Total: 4060

District Wise, Category Wise Vacancies Details in One Click Below