180 రోజుల చైల్డ్ కేర్ లీవ్ లను 10 విడతలలో ఉపయోగించుకోవాలని రివైజ్డ్ ఉత్తర్వులు
Revised G.O 199 PDF click here
ఉద్యోగులకు 11వ PRC 2022 ప్రకారం సమగ్ర సెలవు ప్రయోజనాలకు సంభందించి ఉత్తర్వులు G.O.Ms.No.33 Date: 08.03.2022 విడుదల.
1.ప్రశ్న:
*చైల్డ్ కేర్ లివ్ ఒక స్పెల్ కు మాగ్జిమం ఎన్ని రోజులు పెట్టుకోవచ్చు. 1,2 రోజులు కూడా పెట్టుకోవచ్చునా ?*
*👉 సమాధానము:*
180 రోజుల చైల్డ్ కేర్ లీవ్ లను 10 విడతలలో ఉపయోగించుకోవాలని రివైజ్డ్ ఉత్తర్వులు
2. ప్రశ్న:
*చైల్డ్ కేర్ లివ్ ముందుగానే మంజూరు చేయించుకోవాలా? సెలవు కాలంలో పూర్తి జీతం చెల్లిస్తారా ?*
*👉 సమాధానము:*
*చైల్డ్ కేర్ లివ్ ను DDO తో ముందుగానే మంజూరు చేయించుకుని, ప్రొసీడింగ్స్ ద్వారా వివరాలను సర్వీసు పుస్తకములో నమోదు చేయించుకోవాలి. ఆ నెల వేతనాన్ని యధావిధిగా మంజూరు చేయాల్సిన బాధ్యత DDO దే.
3. ప్రశ్న:
*చైల్డ్ కేర్ లివ్ పెట్టిన సెలలో ఇంక్రిమెంట్ ఉన్నట్లయితే మంజూరు చేయవచ్చునా ?*
*👉 సమాధానము:*
*వీలుపడదు. సెలవు కాలంలో వేతన వృద్ధి ఉండదు. కావున సెలవు అనంతరం విధులలో చేరిన నాటినుండే ఇంక్రిమెంట్ మంజూరు చేస్తారు.*
4. ప్రశ్న:
*మెటర్నిటి లీవుకు కొనసాగింపుగా చైల్డ్ కేర్ లీవు పెటుకోవచ్చునా ?*
*👉 సమాధానము:*
*చైల్డ్ కేర్ లీవును అన్ని విధాలుగా Other than casual, spl. casual leave తో కలిపి పెట్టుకోవచ్చునని జీవో.209 లోని రూలు 3(i) సూచిస్తోంది.
5. ప్రశ్న:
సర్రోగసి, దత్తత ద్వారా సంతానం పొందిన మహిళా ఉద్యోగులు చైల్డ్ కేర్ లివ్ కు అర్హులేనా ?
*👉 సమాధానము:*
*అర్హులే. 90 రోజుల సెలవు వాడుకొనవచ్చును.
6. ప్రశ్న:
*భార్య మరణించిన పురుష ఉద్యోగికి చైల్డ్ కేర్ లీవ్ మంజూరు చేయవచ్చునా ?
*👉 సమాధానము:*
*వీలు లేదు. ఇందుకు సంబంధించిన GO.209 లో Women Employees అని ఉన్నది.*
7. ప్రశ్న:
*చైల్డ్ కేర్ లీవ్ కు అప్లై చేసిన ప్రతిసారి పుట్టినతేది వివరాలు సమర్పించాలా?*
*👉 సమాధానము:*
*అవసరం లేదు. మొదటి సారి అప్లై చేసేటపుడు మాత్రమే కుమారుడు/కుమార్తె డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ సమర్పించాలి. ప్రతి దఫా అప్లికేషన్ సమర్పిస్తే సరిపోతుంది.*
8. ప్రశ్న:
*పిల్లల అనారోగ్యం,చదువుల కొరకు మాత్రమే చైల్డ్ కేర్ లీవ్ మంజూరుచేస్తారా ?*
*👉 సమాధానము:*
*GO.209 point.3 లో ఇలా ఉన్నది "Children needs like examinations, sickness etc", అని ఉన్నది కావున పై రెండు కారణాలకే కాకుండా ఇతరత్రా కారణాలకు కూడా చైల్డ్ కేర్ లీవు మంజూరు చేయవచ్చును.*
9. ప్రశ్న:
*చైల్డ్ కేర్ లీవ్ కు ప్రిఫిక్స్,సఫిక్స్ వర్తిస్తాయా ?
*👉సమాధానము:
*వర్తిస్తాయి, ప్రభుత్వ సెలవు దినాలతో ఇట్టి సెలవును అనుసంధానం చేసుకోవచ్చును.
Child Adoption Leave / Child Care Leave / Special Causal Leave to orthopedically challenged / Ex-gratia on EOL for certain deceases లపై thana ఉత్తర్వులు.*
చైల్డ్ కేర్ లీవ్ 60 రోజుల నుంచి 180 రోజులకు పెంపు.*
చైల్డ్ కేర్ లీవ్ ఒంటరి పురుష ఉద్యోగులకు కూడా వర్తింపు.
చైల్డ్ కేర్ లీవ్ మహిళా ఉద్యోగులకు 60 రోజుల నుంచి 180 రోజులకు పొడిగిస్తూ ఉత్తర్వులు*
ఒంటరిగా ఉన్న పురుష ఉద్యోగులకు కూడా ఈ చైల్డ్ కేర్ లీవ్ సౌకర్యం కల్పించబడింది*
పిల్లలను దత్తత చేసుకుంటే పిల్లల వయస్సు ఒక సంవత్సరం లోపు వరకు మహిళ ఉద్యోగికి ఆరు నెలల పాటు జీతం తో కూడిన సెలవు ఇస్తూ ఉత్తర్వులు*
ఉదాహరణకు దత్తత తీసుకున్నప్పుడు పిల్లల వయస్సు ఆరు నెలలు అయితే మహిళా ఉద్యోగికి ఆరు నెలలు సెలవు మంజూరు చేస్తారు*
రెండవ సందర్భం దత్తత తీసుకున్నప్పుడు పిల్లల వయస్సు 9 నెలలు అయితే మహిళా ఉద్యోగి మూడు నెలలు సెలవు మంజూరు చేస్తారు
దత్తత తీసుకున్న ఉద్యోగి పురుషుడైతే 15 రోజులు petarnity మంజూరు చేస్తారు*
పై నిబంధన ఇద్దరు పిల్లల వరకు మాత్రమే
Child Care Leave 180 రోజులకు పెంచుతూ single male ఉద్యోగులకు అవకాశం కల్పిస్తూ GO 33 విడుదల చేసారు. దీనిపై వివరణ కరపత్రం, MP/ZP టీచర్స్ కు విడి విడిగా
1) leave permission letter
2) sanctioning permission letter
3)DDO proceeding copies ఇవ్వడం జరిగిందీ.
CHILD CARE LEAVE DETAILS IN TELUGU
CHILD CARE LEAVE G.O.COPY & APPLICATION
CCL REQUEST LETTER, DDO PROCEEDINGS FOR MANDAL TEACHERS
REQUEST LETTER, DDO PROCEEDINGS FOR ZP TEACHERS