ap-intermediate-exams-re-counting-re-verification-details

 ap-intermediate-exams-re-counting-re-verification-details
Inter Supply Exams Fee 2024 : నేటి నుంచి ఏపీ ఇంటర్‌ సప్లిమెంటరీ ఎగ్జామ్స్‌ ఫీజు చెల్లించవచ్చు.. మే 24 నుంచి AP Inter Supply Exams ప్రారంభం.
AP Inter Supplementary Exams 2024 : ఆంధ్రప్రదేశ్‌లో ఏపీ ఇంటర్‌ ఫలితాలు ఈనెల 12వ తేదీన విడుదలైన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు జరిగిన ఇంటర్‌ పరీక్షల ఫలితాలను ఏప్రిల్‌ 12వ తేదీన ఇంటర్‌ బోర్డు విడుదల చేసింది. ఇంటర్‌ పరీక్షల్లో ఫెయిల్‌ అయిన విద్యార్ధులు, ఇంప్రూవ్‌మెంట్‌ రాయగోరే విద్యార్ధులు ఏప్రిల్ 18వ తేదీ నుంచి సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజు చెల్లించాలని ఇంటర్‌ బోర్డు అధికారులు వెల్లడించారు. సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లింపులకు ఏప్రిల్ 30వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. అభ్యర్థులు ఎప్పటికప్పుడు పూర్తి వివరాలను  https://bieap.apcfss.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

AP Inter Results 2024: ఏపీ ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్.. రీకౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌కు ఛాన్స్‌! ముఖ్యమైన తేదీలు ఇవే..

AP Inter Results 2024: రీకౌంటింగ్‌ & రీవెరిఫికేషన్‌ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం*
ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌లో 67 శాతం, సెకండ్‌ ఇయర్‌లో 78 శాతం ఉత్తీర్ణత నమోదైంది.
అయితే పరీక్షలు బాగా రాసినప్పటికీ మార్కులు తక్కువగా వచ్చాయని భావించే విద్యార్దులకు ఇంటర్ బోర్డు ముఖ్య ప్రకటన జారీ చేసింది. రీకౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌కు అవకాశం ఇస్తున్నట్లు తన ప్రకటనలో పేర్కొంది. 
ఏప్రిల్‌ 18, 2024 నుంచి ఏప్రిల్ 30, 2024వ తేదీ వరకు రీకౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌కు అవకాశం ఇస్తున్నట్లు ఇంటర్‌ బోర్డు స్పష్టం చేసింది. దీని ద్వారా అభ్యంతరం లేవనెత్తిన విద్యార్ధుల ఇంటర్‌ జవాబు పత్రాలను మరోసారి మూల్యాంకనం చేసేందుకు, మార్కులను మరోమారు కౌటింగ్‌ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఈ అవకాశాన్ని సద్వానియోగ పరచుకోవాలని ఇంటర్‌ బోర్డు అధికారులు సూచించారు.
మార్కులు తక్కువగా వచ్చిన విద్యార్థులు రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్‌ కోసం ఇదే తేదీల్లో ఫీజు చెల్లించాలి. జవాబు పత్రాల (ఒక్కో పేపర్‌) రీ వెరిఫికేషన్‌కు రూ.1300.. రీకౌంటింగ్‌కు రూ.260 చెల్లించాలి.
ఏప్రిల్ 18 నుంచి ఫీజు చెల్లింపు ప్రక్రియ ప్రారంభమయ్యింది, ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 24 వరకు అవకాశం కల్పించగా, ఫీజు చెల్లింపు గడువును ఏప్రిల్ 30 వరకు పొడిగించినట్లు అధికారులు తెలిపారు.
Reverification of valued answered Scripts LINK CLICK HERE
Recounting of Marks LINK CLICK HERE

విద్యార్థులు https://bieap.apcfss.in/ShortMemosLinks.do వెబ్‌సైట్‌లోకి వెళ్లి హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి మార్కుల షార్ట్ మెమోను పొందవచ్చు. 

ఈ మెమోలో విద్యార్ధుల ఫోటోతో పాటు.. వారు సాధించిన మార్కుల వివరాలు ఉన్నాయి.

AP INTER MARKS MEMOS DOWNLOAD LINK CLICK HERE