doubts-on-service-matters-for-ap-teachers-employees

 doubts-on-service-matters-for-ap-teachers-employees

సందేహాలు – సమాధానాలు

1. సందేహం: 

నేను HM గా పనిచేస్తున్నాను. అనారోగ్య కారణాల చేత SA గా రివర్సన్ తీసుకోవాలని అనుకుంటున్నాను. పరిస్థితి ఏమిటి?*

సమాధానం:

FR14 ప్రకారం HM పోస్టులో లీన్ స్థిరీకరణ జరిగే వరకు SA పోస్టులో మీ లీన్ కొనసాగుతుంది. కనుక మీరు రివర్శన్ తీసుకోవచ్చు. ఐతే పదోన్నతి ద్వారా వచ్చిన 2 ఇంక్రిమెంట్లు రద్దు అవుతాయి. SA క్యాడర్ లో తదుపరి AAS కి అర్హత ఉండదు.

2. సందేహం:

నాకు వినికిడి లోపం 70 శాతం ఉన్నట్లు మెడికల్ సర్టిఫికేట్ కలదు. కాని ఎలవెన్స్ పొందటానికి సరైన వివరములు లేవు. నేను అలవెన్స్ పొందటానికి అర్హుడునా..?*

సమాధానం:

మీరు కన్వీయన్స్ ఎలవెన్స్ కు అర్హులు. సంబంధిత ఉత్తర్వులు DDO ఇస్తే సరిపోతుంది. GO MS:197, Dt:6-7-2006. సివిల్ సర్జన్ ర్యాంక్ తగ్గని తత్సంబంధిత వైద్యుడు ఈ ధృవపత్రం జారీ చేయాలి. ఈ సర్టిఫికేట్ జారీ చేసిన తేదీ నుండి వర్తించును. CL తప్పించి మరి ఏ సెలవులలోనూ ఈ ఎలవెన్స్ ఇవ్వబడదు. సస్పెన్సన్ కాలంలో కూడా ఇవ్వబడదు.*

GO MS No:262, Dt:25-8-1980.

3. సందేహం:

సీనియర్ స్టెప్ అప్ తీసుకున్న తర్వాత జూనియర్ SPP-1A స్కేల్ తీసుకోవటం వల్ల సీనియర్ కంటే ఎక్కువ వేతనం పొందుతున్నాడు. ఇపుడు సీనియర్ మరల స్టెప్ అప్ చేసుకొనే వీలు ఉన్నదా?

సమాధానం:

వీలు లేదు. స్టెప్ అప్ నిబంధనలు ప్రకారం సీనియర్ ఒకసారి మాత్రమే స్టెప్ అప్ చేసుకొనే వీలు ఉన్నది.

4. సందేహం:

నేను ZPHS లో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాను. స్కూల్ అసిస్టెంట్ కి ఉండవలసిన అర్హతలు అన్నీ కలిగి ఉన్నాను. నాకు స్కూల్ అసిస్టెంట్ గా పదోన్నతి ఇస్తారా?*

సమాధానం: అవకాశం లేదు.

5. సందేహం:

నా భార్య CPS ఉద్యోగి. ఆమె మరణించారు. ఇపుడు నేను ఏమి చేయాలి?*

సమాధానం:

CPS లో ఉన్న డబ్బులు కోసం 103–జీడీ ఫారం పూర్తి చేయాలి. సంబంధిత పత్రాలు జతపరచి DDO ద్వారా ట్రెజరీకి పంపాలి. వీరు వాటిని PRA ముంబై కి పంపాలి. వారు పరిశీలించి, మీ ఖాతాలో డబ్బులు జమ చేస్తారు.*