how-to-use-Postal ballot

 how-to-use-Postal ballot
పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ వేసే విధానంపై విధివిధానాలు విడుదల చేసిన EC వారు (తెలుగులో...)
5, 6, 7 తేదీలలో మనం  ఫెసిలిటేషన్ సెంటరు లో ఓటు వేయబోయే Postal ballot గురించిన సమాచారం*
13 A(Form - A) (డిక్లరేషన్)
13 B(Form - B) (చిన్న కవర్)
13 C (Form -C) (పెద్ద కవర్)
Ballot paper
13D  అంటే సూచనలు.( మన కోసం)
పై నాలుగు confuse గా వుంటే, simple  trick గుర్తు పెట్టుకోండి.
13A(Form -A)*
ఇది పేపర్ రూపం లో వుంటుంది.దీని మీద మన డీటెయిల్స్ అండ్ Gazetted  officer signature చేయించాలి.
NOTE:*గెజిటెడ్ ఆఫీసర్స్ అక్కడే ఉంటారు*
13B (Form - B)* 
అంటే ఇది ఎన్వలప్ కవర్, Envelo p cover కి Form - B అని పేరు అంతే, *ఇది చిన్న కవర్.* 
*దీని మీద Ballot  Paper సీరియల్ రాయాలి,* (వాళ్ళే రాసి ఇస్తారు,) Ballot పేపర్ మీద మనం అనుకున్న టిక్ మార్క్ పెట్టీ చిన్న కవర్లో (Form -B)పెట్టీ సీల్ చేయాలి.
13C (Form - C)* 
*ఇది పెద్ద కవర్* అన్నమాట, దీనికి ఫామ్-C అని పేరు అంతే కానీ, ఇది కవర్ మాత్రమే.
*దీనిమీద మాత్రం మీ సిగ్నేచర్ మరియు అసెంబ్లీ/ పార్లమెంట్ ఎది ఐతే అది రాయాలి.*
లాస్ట్ చివరి ఘట్టం ఫస్ట్ ఇచ్చిన డిక్లరేషన్ ఫామ్(A), మరియు ballot పెట్టీ సీల్ చేసిన చిన్నకవర్(B),
రెండింటినీ పెద్ద కవర్(Form -C) లో పెట్టీ సీల్ చేసి box లో వేయాలి.అంతే సింపుల్.
ఎవరు కంగారు పడవద్దు,తెలియకపోతే అక్కడ మన facilitation centre PO /APO లు .మిమ్మల్ని గైడ్ చేస్తారు.
మీ అమూల్యమైన ఓటు వినియోగించుకోండి.
*మిత్రులారా పోస్టల్ బ్యాలెట్ పై విధంగా ✅ మార్క్ తో వెయ్యాలి.ఐతే....ఆ  ✅ మార్క్ మీరు వెయ్యాలి అనుకున్న అభ్యర్థికి పైన, కింద ఉన్న బార్డర్ గీతలను తాకకూడదు. అలా తాకితే 
ఇన్ వ్యాలిడ్ అవుతుంది.
2019 లో postal ballot votes లో సుమారు 55% invalid అయ్యాయి.. ఇది దురదృష్టకరం.*
మేధావి వర్గమైన ఉపాధ్యాయులు....ఈ ఎలక్షన్స్ లో postal ballot votes invalid పెర్సంటేజ్ ని బాగా తగ్గించాలి.
అందుకు ఖచ్చితంగా ముందుగా అవగాహన కలిగి ఉండి తమ ఓటును వినియోగించుకోవాలి.
పోస్టల్ బ్యాలట్ లెక్కేంచేటప్పుడు ఈ క్రింది విషయాలు పరిగణనలోకి తీసుకొని పోస్టల్ బ్యాలట్ invalid చేస్తారు
పోస్టల్ బ్యాలట్ లెక్కించేటపుడు
1. డిక్లరేషన్ పై assembly/పార్లమెంట్ వ్రాసారా, లేదా
2. బ్యాలట్ సీరియల్ నెంబర్ ఉన్నదా, లేదా
3. గెజిటెడ్ signature ఉన్నదా లేదా
4. బ్యాలట్ పేపర్ లో సరిగా tick/cross మార్క్ సరిగా గుర్తించారా, లేదా
5. బ్యాలట్ పేపర్ ఉంచిన inner "A" cover పైన బ్యాలట్ సీరియల్ నెంబర్ వేసారా, లేదా
6. డిక్లరేషన్ (Form 13A), inner "A" (Form 13B బ్యాలట్ ఉంచిన కవర్ ) ఈ రెండు outer cover"B" నందు ఉంచి outer కవర్ "B" పైన signature of the voter అన్న చోట సంతకం ఉందా, లేదా అని చూసి అన్ని సక్రమంగా ఉంటే మీ పోస్టల్ బ్యాలట్ లెక్కింపు లోనికి వెళుతుంది. ఇందులో చెప్పిన ఏ ఒక్కటి సరిగా లేకపోయినా మీ పోస్టల్ బ్యాలట్ invalid అవుతుంది.
మనం వేసే పోస్టల్ బ్యాలట్ సద్వినియోగం అయ్యే విధంగా అందరు తగుజాగ్రత్తలు తీసుకొని, పోస్టల్ బ్యాలట్ invalid కాకుండా ఉండాలని కోరుతున్నాము.