internet-is-slow-on-your-phone-change-these-settings

 internet-is-slow-on-your-phone-change-these-settings

Internet Speed : మీ ఫోన్‌లో ఇంటర్నెట్‌ స్లోగా ఉందా..? అయితే.. ఈ సెట్టింగ్స్‌ మార్చుకోండి!

How to Increase Your Internet Speed : నేటి సాంకేతిక కాలంలో ఇంటర్నెట్‌ అనేది మనందరి జీవితంలో ఓ ముఖ్యమైన భాగంగా మారిపోయింది. నిద్రలేచింది మొదలు.. నిద్రపోయే వరకు నిత్యజీవితంలో అనేక పనులు ఇంటర్నెట్‌ ఆధారంగా మొబైల్‌తోనే చేస్తున్నాం. పాల ప్యాకెట్‌ దగ్గర నుంచి రెంట్‌ పే చేయడం, డబ్బు లావాదేవీలు, కొనడాలు, సినిమాలు, గేమ్స్‌ వంటి అనేక పనులు ఇంటర్నెట్‌ లేకుండా సాధ్యం కాదు. అయితే కొన్నిసార్లు ఇంటర్నెట్ వేగం సడెన్‌గా తగ్గిపోతుంది. దీంతో బ్రౌజింగ్, డౌన్‌లోడ్ సరిగా జరగదు. చాలా పనులు మధ్యలోనే ఆగిపోతాయి. ఈ పరిస్థితుల్లో మనం తీవ్ర ఆందోళనకు గురవుతాం. అయితే ఈ చిట్కాలను ఉపయోగించి ఇంటర్నెట్ వేగాన్ని పెంచుకోవచ్చు. అవేమిటంటే..

స్మార్ట్‌ఫోన్‌లన్నింటిలో ‘ఫైట్ మోడ్’ ఆప్షన్ ఉంటుంది. దీని కోసం సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఫైట్ మోడ్‌ను ఆఫ్ చేసి.. కొద్దిసేపటి తర్వాత ఆన్ చేస్తే, మీ ఫోన్ ఇంటర్నెట్ పూర్తి వేగంతో పనిచేస్తోంది.
మీ ఫోన్ నెట్ స్పీడ్‌ని మెరుగుపరచడానికి మరొక సులభమైన మార్గం మెుబైల్ డేటా ఆప్షన్‌ను ఆఫ్ చేయడం. మీరు ఫోన్ డేటాను కాసేపు ఆఫ్ చేసి.. కొద్దిసేపటి తర్వాత రీస్టార్ట్ చేయడం ద్వారా మొబైల్ డేటా ఫుల్ స్పీడ్‌తో రన్ అవుతుంది.
సాధారణంగా ఇంటర్నెట్ స్పీడ్ నెట్వర్క్ టైప్‌ను బట్టి ఉంటుంది. 4G నెట్‌వర్క్ ఉంటే ఇంటర్నెట్ స్పీడ్‌గా ఉంటుంది. కొన్ని నెట్‌వర్క్ సరిగ్గా పని చేయవు. దీని కోసం మొదట ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి మొబైల్ నెట్‌వర్క్‌ను 4Gకి ఎనేబుల్ చేయాలి. తర్వాత నెట్వర్క్ సెట్టింగ్స్‌కు వెళ్లి యాక్సెస్ పాయింట్ పేర్లపై క్లిక్ చేసి ఏపీఎన్ ను డిఫాల్ట్ గా రీసెట్ చేయాలి.
చాలా సందర్భాల్లో మొబైల్ నెట్‌వర్క్ సరిగ్గా రాకపోవడానికి కారణం మీ డివైజ్ లేటెస్ట్ అప్‌డేట్‌తో ఇన్‌స్టాల్ చేయకపోవడం కూడా కారణం కావచ్చు. అందువల్ల, ఫోన్ లేటెస్ట్ సాఫ్ట్‌వేర్‌తో అప్‌డేట్ అయ్యిందో లేదో చెక్‌ చేసుకోండి.

స్పీడ్ టెస్టులో మీ ఇంటర్నెట్ వేగం తక్కువగా ఉన్నట్లు తేలితే DNS సర్వర్‌ మార్చుకోవడం ద్వారా వేగాన్ని పెంచుకునే అవకాశం ఉంటుంది.
క్రాష్, కుక్కీలను క్లియర్ చేయాలి. మోబైల్ ఫోన్ లో క్రాష్, కుక్కీలను క్లియర్ చేసుకోవాలి. ఇలా చేయడం వలన మీ ఇంటర్నెట్ బ్రౌజింగ్‌ వేగవంతం అవుతుంది.
డేటా సేవింగ్ మోడ్‌ని ఆన్ చేయాలి. ఫోన్ లో డేటా సేవింగ్ మోడ్ ను ఆన్ చేయడం కూడా ఇంటర్నెట్ వేగం పెంచుకునే అవకాశం ఉంటుంది.
బ్యాక్‌గ్రౌండ్ యాప్‌లను క్లోజ్ చేయాలి. ఒకేసారి చాలా యాప్‌లను రన్ కావడం వల్ల ఇంటర్నెట్ వేగం తగ్గే అవకాశం ఉంటుంది. RAMని ఖాళీ చేయడం వలన ఇంటర్నెట్ వేగం పెరుగుతుంది. ఇందుకోసం బ్యాక్‌గ్రౌండ్ యాప్‌లను క్లోజ్ చేయాలి.
ఆటో-అప్‌డేట్‌లను నిలిపివేయాలి. ఆటోమేటిక్ అప్‌డేట్‌లు చాలా డేటాను తీసుకుంటాయి. దీని వలన ఇంటర్నెట్ వేగం తగ్గుతుంది. ఈ నేపథ్యంలో యాప్‌ల ఆటోమేటిక్ అప్‌డేట్‌లను ఆఫ్ చేయాలి.