new-update-in-income-tax-notice-column
ట్యాక్స్ పేయర్లకు గుడ్‌న్యూస్.. ITR పోర్టల్‌లో కొత్త ఫీచర్లు.. ఇక నోటీసులొచ్చినా నో టెన్షన్!
Income Tax: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు శుభవార్త అందించింది ఇన్‌కమ్ ట్యాక్స్ విభాగం. ఇన్‌కమ్ ట్యాక్స్ నోటీసులు, లెటర్లు, డిమాండ్ నోటీసులు, మెసేజ్‌లు వచ్చినప్పుడు చాలా మంది ఆందోళన చెందుతారు. వాటికి ఏ విధంగా సమాధానం ఇవ్వాలో తెలియక సతమతమవుతుంటారు. ఇకపై అలాంటి టెన్షన్లు ఉండవంటున్నారు ట్యాక్స్ నిపుణులు. ఐటీఆర్ పోర్టల్‌లో రెండు కొత్త ఫీచర్లు తీసుకొచ్చినట్లు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఇన్‌కమ్ ట్యాక్స్ ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో కొత్త అప్డేట్ తీసుకొచ్చింది ఐటీ శాఖ. ఇ-ప్రొసీడింగ్స్ ట్యాబ్‌లో కొత్త ఫీచర్లను జోడించింది. పెండింగ్ ట్యాక్స్ ప్రొసీడింగ్స్ గల ట్యాక్స్ పేయర్లకు ఈ కొత్త ఫీచర్లు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. వారికి సంబంధించిన పెండింగ్ ప్రొసీడింగ్స్ సమాచారాన్ని ఈజీగా సర్చ్ చేసి వాటికి సమాధానం ఇవ్వవచ్చు. ఈ మేరకు తరుచూ అడిగే ప్రశ్నలకు సమాధానాల్లో ఈ విషయాన్ని వెల్లడించింది. ట్యాక్స్ నోటీసులు, లెటర్లు, డిమాండ్ నోటీసులకు ఈజీగా ఎలక్ట్రానిక్ పద్ధతిలోనే సమాధానం ఇచ్చేందుకు ఇ-ప్రొసీడింగ్స్ ట్యాబ్ లో కొత్త ఫీచర్లు జోడించినట్లు తెలిపింది.
అతిగా స్క్రోలింగ్ అవసరం లేదు..
ఒక నిర్దిష్ట ప్రొసీడింగ్ కోసం శోధిస్తున్నప్పుడు పోర్టల్‌లో ఎక్కువగా స్క్రోలింగ్ చేయాల్సిన అవసరాన్ని తొలగించేందుకు ఆదాయపు పన్ను శాఖ ప్రత్యేక పేజీలను తీసుకొచ్చింది. ఈ మార్పును అమలు చేయడానికి ముందు బహుళ ప్రొసీడింగులను నావిగేట్ చేయడానికి చాలా శ్రమ పడాల్సి వచ్చేందని, పన్ను చెల్లింపుదారులు, వారి అధీకృత వినియోగదారులు సంబంధిత ప్రొసీడింగులకు వెళ్లేటప్పుడు అవాంతరాలను ఎదుర్కొంటున్నారని ట్యాక్స్ నిపుణులు చెప్పారు. ఇకపై అలాంటి సమస్యలు ఉండవంటున్నారు.ఈజీ సర్చ్ కోసం కొత్త ఫిల్టర్లు..
తమ పెండింగ్ ప్రొసీడింగులను ఈజీగా తెలుసుకునేందుకు కొత్త ఫిల్టర్లు తీసుకొచ్చింది ఐటీ శాఖ. ప్రొసీడింగ్ స్టేటస్, అసెస్మెంట్ ఇయర్, ప్రొసీడింగ్ డేట్, నోటీస్ తేదీలు, వంటి ఆధారంగా కొత్త ఫిల్టర్లు పని చేయనున్నాయి. వీటిని ఉపయోగించి ట్యాక్స్ పేయర్లు తమ ప్రొసీడింగులను తెరిచి, చెక్ చేసుకుని వాటికి తగిన విధంగా స్పందించవచ్చని ట్యాక్స్ నిపుణులు సూచిస్తున్నారు. దీంతో చాలా ఈజీగా ఇంటి నుంచే పని పూర్తి చేయవచ్చని చెబుతున్నారు.ఇ-ప్రొసీడింగ్స్ ట్యాబ్ ఎలా గుర్తించాలి?
- ముందుగా మీ వివరాలతో ఐటీఆర్ ఇ-ఫైలింగ్ పోర్టల్ లోకి లాగిన్ కావాలి.
- పెండింగ్ యాక్సన్స్ లోకి వెళ్లి ఇ-ప్రొసీడింగ్స్ పై క్లిక్ చేయాలి.
- మీకు ఎలాంటి ఇ-ప్రొసీడింగ్స్ లేకుంటే అక్కడ ఏ వివరాలు కనిపించవు. మీకు ఎవైనా పెండింగ్ ప్రొసీడింగ్స్ ఉంటే.. వాటి వివరాలు కనిపిస్తాయి. అందులోంచి మీకు కావాల్సినవి ఎంచుకుని సమాధానం ఇవ్వవచ్చు.