send-a-message-without-saving-the-number-in-whatsapp

 send-a-message-without-saving-the-number-in-whatsapp
Whatsapp : వాట్సాప్ లో నెంబర్ సేవ్ చెయ్యకుండా మెసేజ్ చెయ్యొచ్చు.. ఎలాగంటే?
ప్రముఖ మెసేజింగ్ సోషల్ మీడియా యాప్ వాట్సాప్ గురించి అందరికీ తెలుసు.. స్మార్ట్ ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ ను వాడుతుంటారు.. ఈ యాప్ లో ఫోటోలు, వీడియోలతో పాటు కాల్స్ చేసుకొనే వెసులుబాటు కూడా ఉంటుంది. అందుకే ఎక్కువగా వాట్సాప్ ను వాడుతారు.. ఎప్పటికప్పుడు వినూత్న అప్‌డేట్స్‌తో ముందుకు వస్తోంది. కొత్తగా పరిచయమైన వ్యక్తికి వాట్సప్‌లో ఏదైనా పంపాలంటే ముందుగా అతని నెంబర్ ను సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది.

కానీ ఇప్పుడు అలా సేవ్ చెయ్యకుండానే కొత్త వ్యక్తికి మెసేజ్ చెయ్యొచ్చు.. ఒక్కసారి అవసరమున్నా కూడా నెంబర్ ను సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది.. ఇప్పుడు అలా కాకుండా వాట్సాప్ మెసేజ్ లను పంపొచ్చు.. ఏదైన పని కోసం నెంబర్ తీసుకొని వాట్సాప్ చెయ్యాలంటే ఆ నెంబర్ ను సేవ్ చేసి మెసేజ్ చెయ్యాలి. కానీ, వాట్సప్ సర్చ్ బార్ ఫీచర్ అందుబాటులోకి వచ్చాక ఆ సమస్య తీరిపోయింది.. ఆ ఫీచర్ ను యాక్టివేట్ చేసుకుంటే అసలు సేవ్ చెయ్యకుండానే మెసేజ్ చేయొచ్చు.. ఎలాగో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

*. ముందుగా వాట్సాప్ లోకి వెళ్ళాలి..

*. ఐఫోన్ యూజర్లైతే పైన ప్లస్ ఐకాన్ ఉంటుంది, ఆండ్రాయిడ్ యూజర్లైతే వాట్సప్ యాప్‌లో కింద ప్లస్ ఐకాన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేయండి.

*. నెంబర్ ని కాపీ చేయండి. అనంతరం సర్చ్ కాంటాక్ట్‌పై క్లిక్ చేసి నంబర్‌ని పేస్ట్ చేయండి..

*. ఆ నెంబర్ కు వాట్సాప్ అకౌంట్ ఉంటే చాట్ ఆఫ్షన్ కనిపిస్తుంది..ఇక ఆ నెంబర్ తో వాట్సాప్ మెసేజ్ చెయ్యొచ్చు..

ఇవే కాదు వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ తో కస్టమర్లను ఆకట్టుకుంటుంది..