AP EAPCET 2024 Results

AP EAPCET 2024 RESULTS
AP EAMCET-2024
APEAPCET 2024 సీట్ అలాట్మెంట్ లెటర్స్ విడుదల
APEAPCET-2024 Admissions - Allotment of Seats Phase-1 - Allotment Letter - College wise Allotment released and available at

Download Place Allotment Orders CLICK HERE

https://eapcet-sche.aptonline.in/EAPCET/
AP EAPCET 2024 Toppers: ఏపీ ఎప్‌సెట్-2024 ఫలితాల్లో ఇంజినీరింగ్ 75.51%, అగ్రికల్చర్ 87.11 % ఉత్తీర్ణత నమోదు - విభాగాలవారీగా టాపర్లు వీరే

AP EAPCET 2024 Results Toppers List: ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఎప్‌సెట్ ఫలితాలు మంగళవారం (జూన్ 11న) విడుదలయ్యాయి. విజయవాడలో సాయంత్రం 4 గంటలకు ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలరావు, ఉన్నత విద్యామండలి ఇన్‌ఛార్జి ఛైర్మన్ రామమోహన్ రావు ఎప్‌సెట్ ఫలితాలను విడుదల చేశారు. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. దీని ఆధారంగా ర్యాంకులు ప్రకటించనున్నారు. 

ఏపీ ఎప్‌సెట్ పరీక్షలకు సంబంధించి మొత్తం 3.62 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. 3.39 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 2,65,444 మంది అర్హత సాధించారు. ఇంజినీరింగ్‌ విభాగంలో మొత్తం 1,95,092 మంది అర్హత సాధించారు. మొత్తం 75.51 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇక అగ్రికల్చర్ విభాగంలో మొత్తం 70,352 మంది అర్హత సాధించారు. ఉత్తీర్ణలైన విద్యార్థుల సంఖ్య 87.11 శాతంగా ఉంది. 

EAPCET - 2024 RESULTS LINK CLICK HERE
RANK CARD DOWNLOAD LINK CLICK HERE
AP EAPCET (Engineering) Results CLICK HERE
EAPCET (Agriculture & Pharmacy) Results CLICK HERE
ఈ ఏడాది ఈఏపీసెట్‌ను జేఎన్‌టీయూ- కాకినాడ నిర్వహించిన సంగతి తెలిసిందే. మే 16, 17 తేదీల్లో అగ్రికల్చర్‌, ఫార్మసీ విభాగాలకు; మే 18 నుంచి 23 వరకు ఇంజినీరింగ్‌ విభాగానికి పరీక్షలు నిర్వహించారు. హైదరాబాద్‌తోపాటు రాష్ట్రవ్యాప్తంగా 142 పరీక్ష కేంద్రాల్లో ఎప్‌సెట్ పరీక్షలు నిర్వహించారు. పరీక్ష కోసం మొత్తం 3,62,851 మంది విద్యార్థులు దరఖాస్తు చేయగా.. ఇందులో 3,39,139 మంది పరీక్షకు హాజరయ్యారు. ఇంజినీరింగ్‌ విభాగంలో మొత్తం 2,74,213 మందికి గాను 2,58,373 (94.22 శాతం) మంది పరీక్షలు రాశారు. ఇక బైపీసీ విభాగానికి సంబంధించి మొత్తం 88,638 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. ఇందులో 80,766 (91.12 శాతం) విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. అయితే మే 16, 17 తేదీల్లో నిర్వహించిన అగ్రికల్చర్‌, ఫార్మసీ విభాగాలకు సంబంధించిన ప్రిలిమినరీ ఆన్సర్ 'కీ'ని జేఎన్‌టీయూ కాకినాడ మే 23న విడుదల చేసింది. అభ్యర్థుల నుంచి మే 25న వరకు ఆన్సర్ కీపై అభ్యంతరాలను స్వీకరించింది. ఇక మే 24న ఇంజినీరింగ్ విభాగానికి నిర్వహించిన పరీక్షల ఆన్సర్ కీని, మాస్టర్ క్వశ్చన్ పేపర్లను, అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను విడుదల చేశారు. ఆన్సర్ ‘కీ’ పై మే 26 వరకు అభ్యంతరాలు స్వీకరించారు. ఈ ప్రక్రియ ముగియడంతో తాజాగా ఫలితాల వెల్లడికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.    
AP EAPCET 2024 Results | ఏపీ ఎప్‌సెట్ ఫలితాలు ఇలా చూసుకోండి..
➨ ఎప్‌సెట్ ఫలితాల కోసం అభ్యర్థులు మొదట అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి- https://cets.apsche.ap.gov.in/EAPCET/Eapcet/EAPCET_HomePage.aspx
➨ అక్కడ హోంపేజీలో కిందిభాగంలో కనిపించే  AP EAPCET 2024 Results లింక్ మీద క్లిక్ చేయాలి. 
➨ ఆ తర్వాత వచ్చే పేజీలో అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు, ఎప్‌సెట్ హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదు చేయాలి.
➨ ఐసెట్ ఫలితాలు కంప్యూటర్ స్క్రీన్ మీద కనిపిస్తాయి.
➨ ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకొని, ప్రింట్ తీసుకోవాలి. భవిష్యత్ అవసరాల కోసం భద్రపరచుకోవాలి. 
AP EAPCET - 2024 RESULTS LI NK 1 CLICK HERE
AP EAPCET (Engineering) 2024 Results CLICK HERE
AP EAPCET (Agriculture & Pharmacy) 2024 Results CLICK HERE
ఏపీ ఈఏపీసెట్- 2024 ద్వారా ప్రవేశాలు కల్పించే కోర్సులు:
➥ ఇంజినీరింగ్, బయో టెక్నాలజీ, బీటెక్‌(డెయిరీ టెక్నాలజీ), బీటెక్ (అగ్రికల్చరల్ ఇంజినీరింగ్), బీటెక్ (ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ)
➥ బీఎస్సీ(అగ్రికల్చర్), బీఎస్సీ(హార్టికల్చర్), బీవీఎస్సీ &‌ హెచ్, బీఎఫ్‌ఎస్సీ
➥ బీఫార్మసీ, ఫార్మా-డి.
➥ బీఎస్సీ (నర్సింగ్).

AP EAPCET ఏ రాంక్ కి ఏ కాలేజీ లో ఏ బ్రాంచ్ వస్తుంది LINK-1  ఇక్కడ  క్లిక్ చేయండి

AP EAMET ఏ రాంక్ కి ఏ కాలేజీ లో ఏ బ్రాంచ్ వస్తుంది LINK-2 ఇక్కడ క్లిక్ చేయండి 

AP EAPCET-2024 MOCK COUNSELING PREDOCTOR (FOR AGRICULTURE) CLICK HERE