NEET-Result 2024-link

 NEET-Result 2024-link

NEET Result 2024 Live : నీట్‌ ఫలితాలు విడుదల.. NEET Results Link ఇదే

NEET UG Result 2024 : దేశంలోని మెడికల్‌ కాలేజీల్లో వైద్య విద్యకు సంబంధించిన అండర్ గ్రాడ్యుయేట్స్ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే నీట్ యూజీ 2024 (NEET UG 2024) ఫలితాలను జూన్ 4వ తేదీ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ప్రకటించింది. అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల కోసం నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET 2024)కు హాజరైన అభ్యర్థులందరూ ఎన్‌టీఏ నీట్ అధికారిక వెబ్ సైట్ https://neet.ntaonline.in/ వెబ్‌సైట్‌ ద్వారా స్కోర్ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఎన్టీఏ నీట్ యూజీ ఫలితాలను కూడా  https://neet.ntaonline.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. 
NEET UG Result 2024 చెక్‌ చేసుకోవడానికి డైరెక్ట్‌ లింక్‌ ఇదే.. క్లిక్‌ చేయండి. నీట్ యూజీ 2024 స్కోర్లను చెక్ చేసుకోవడానికి అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ అవసరం.
నీట్‌ యూజీ 2024 ఫలితాలను జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) జూన్‌ 4వ తేదీన వెల్లడించిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఈసారి 23.33 లక్షల మంది పరీక్ష రాశారు. వారిలో 13.16 లక్షల మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 67 మందికి సమాన పర్సంటైల్‌ (99.997129) దక్కడంతో వారందరికీ ఫస్ట్‌ ర్యాంకు కేటాయించారు. ఫస్ట్‌ ర్యాంకు సాధించిన వారిలో నలుగురు ఏపీ విద్యార్థులుండటం గమనార్హం.
ఈ ఏడాది నీట్ యూజీ ప్రవేశ పరీక్షను 2024 మే 5వ తేదీన దేశవిదేశాల్లో నిర్వహించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు ఒకే షిఫ్టులో పరీక్ష నిర్వహించారు. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ (NEET)-2024ను 14 నగరాలతో సహా దేశవ్యాప్తంగా 557 నగరాల్లోని వివిధ కేంద్రాల్లో 24 లక్షల మందికి పైగా అభ్యర్థులు రాశారు. నీట్ యూజీ 2024 ప్రొవిజనల్ ఆన్సర్ కీని మే 29న విడుదల చేయగా.. 2024 జూన్ 1వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించారు. ఇక.. ఫైనల్‌ ఆన్సర్‌ కీని 2024 జూన్ 3వ తేదీన విడుదల చేశారు.
NEET 2024 RESULTS LINK CLICK HERE