Aadhar-number-to-Phone-number-Link

 Aadhar-number-to-Phone-number-Link

Aadhaar: మీ ఆధార్‌కు ఏ నంబర్ లింక్ అయ్యిందో మర్చిపోయారా? మరేం పర్లేదు.. ఇలా ఈజీగా తెలుసుకోవచ్చు..

మీ ఆధార్ నంబర్ కు ఏ ఫోన్ నంబర్ లింక్ చేశారో మర్చిపోయారా? ఆధార్ రిజిస్ట్రేషన్ అప్పుడు ఇచ్చిన ఫోన్ నంబర్ మీరు మార్చేశారా? ఆ నంబర్ ఇప్పుడు మీ దగ్గర లేదా?
మీరేమి టెన్షన్ పడనవసరం లేదు. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ) మీ ఫోన్ నంబర్, ఈ మెయిల్ ఐడీలను సులభంగా వెరిఫై చేసుకొనే వెసులుబాటును కల్పించింది. ఏ ఫోన్ నంబర్, ఈ మెయిల్ మీ ఆధార్ కు లింక్ అయ్యి ఉందో తెలుసుకొనే అవకాశం ఇచ్చింది. ఈ మేరకు మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది.

ఎలా చేయాలంటే.

కొన్ని సందర్భాల్లో ఆధార్ కార్డు హోల్డర్స్ వారు తమ ఆధార్ కార్డుకు ఏ ఫోన్ నంబర్ లింక్ చేశారు. ఈ మెయిల్ ఐడీ ఏమి ఇచ్చారు వంటి వివరాలు మర్చిపోతున్నారు. దీని వల్ల ఎప్పుడైనా ఓటీపీలు సేకరించాలకున్నప్పుడు ఇబ్బంది పడుతున్నారు. దీనిని గుర్తించిన యూఐడీఏఐ పరిష్కారానికి కొత్త మార్గాన్ని అన్వేషించింది. కార్డు దారులు https://myaadhaar.uidai.gov.in/ లోకి వెళ్లి వెరిఫై ఈమెయిల్/ మొబైల్ నంబర్ ను క్లిక్ చేయాలి. అలాగే ఎంఆధార్ యాప్ ద్వారా కూడా దీనిని వెరిఫై చేసుకోవచ్చు. దీని ద్వారా మీ ఆధార్ కు లింక్ అయ్యి ఉన్న ఈ మెయిల్, ఫోన్ నంబర్ తెలుస్తోంది. ఒకవేళ లింక్ చేసి లేకపోతే నంబర్, ఈ మెయిల్ ఐడీ మార్చుకునేందుకు అవసరమైన సూచనలను కూడా ఇస్తుంది.

ఒక వేళ మొబైల్ నంబర్ ఇప్పటికే వెరిఫై అయితే మీకు 'ది మొబైల్ నంబర్ యూ హావ్ ఎంటర్డ్ ఈజ్ ఆల్ రెడీ వెరిఫైడ్ విత్ అవర్ రికార్డ్స్' అని డైలాగ్ బాక్స్ డిస్ ప్లేపై కనిపిస్తుంది.
ఒకవేళ మీరు ఎంటర్ చేయడానికి మీకు ఫోన్ నంబర్ గుర్తులేదనుకోండి అప్పుడు మీ ఫోన్ నంబర్ లోని చివరి మూడు నంబర్లు కనిపిస్తాయి. దాని ద్వారా ఏ ఫోన్ నంబర్ లింక్ అయ్యి ఉందో గుర్తించొచ్చు.
ఒకవేళ మీరు ఫోన్ నంబర్ గానీ, ఈమెయిల్ ఐడీ గానీ మార్చుకోవాలి అనుకుంటే దగ్గరలోని ఆధార్ సెంటర్ లో సంప్రదించాలి.