tech-mahindra-semi-voice-process-executive-posts
Tech Mahindra : హైదరాబాద్ - టెక్ మహీంద్రలో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక.. రూ.3.5 లక్షల వరకూ జీతం
Hyderabad Tech Mahindra : హైదరాబాద్ (Hyderabad) మాదాపూర్‌లో ఉన్న చెందిన టెక్ మహీంద్రా (Tech Mahindra) సంస్థ సెమీ వాయిస్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులైన వాళ్లు అర్హులు. ఇంటర్వ్యూలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. వివరాల్లోకెళ్తే..
సెమీ వాయిస్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.
- అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత సాధించిన వాళ్లు అర్హులు.
- పని అనుభవం: 1-5 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
- జీతభత్యాలు: ఏటా రూ.2.5 లక్షలు-రూ.3.5 లక్షలు చెల్లిస్తారు.
- ఎంపిక విధానం: ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
- దరఖాస్తు విధానం: అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్లతో నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావాలి.
- ఇంటర్వ్యూ వేదిక: Tech Mahindra Info City Gate no 2 -Survey No. 64, Unit No.12, Plot No. 35 & 36 Hi-Tech City Layout, Jubilee Enclave, Madhapur, Telangana 500081.
- ఇంటర్వ్యూ తేదీలు: మే 03 నుంచి మే 12వ తేదీ వరకు ఇంటర్వ్యూలు జరుగుతాయి.
- ఇంటర్వ్యూ సమయం: ఉదయం 9 నుంచి సాయంత్రం 3 వరకు ఇంటర్వ్యూలు జరుగుతాయి.