AP Polycet 2023 Counselling-schedule

 AP Polycet 2023 Counselling-schedule-notification

ADMISSIONS INTO POLYTECHNICS (APPOLYCET - 2023)

AP Polycet 2023 Counselling: ఆంధ్రప్రదేశ్‌ పాలిసెట్‌-2023 కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. జూన్ 15 నుంచి తరగతులు

పాలిసెట్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు మే 25 నుంచి జూన్‌ 1 వరకు ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.700 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.250 చెల్లిస్తే సరిపోతుంది. మే 29 నుంచి జూన్‌ 5 వరకు ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నారు. జూన్‌ 1 నుంచి 6 వరకు కళాశాలలు, కోర్సు ఎంపికకు వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. జూన్‌ 7న వెబ్‌ఆప్షన్లలో మార్పు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఇక జూన్ 9న సీట్లను కేటాయించనున్నారు. సీట్లు పొందిన విద్యార్థులకు జూన్ 15 నుంచి తరగతులు ప్రారంభంకానున్నాయి.

 ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లింపు మే25 నుంచి జూన్‌ 1 వరకు చెల్లించవచ్చన్నారు. ధ్రువపత్రాల పరిశీలన మే 29 నుంచి జూన్‌ 5 వరకు నిర్వహించనున్నారు. జూన్‌ ఒకటి నుంచి 6వ తేదీ వరకు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చన్నారు. జూన్‌ 7న ఐచ్ఛికాల మార్పుకు అవకాశం కల్పిస్తారు.

జూన్‌ 9న సీట్ల కేటాయింపు చేస్తారు. అడ్మిషన్ ప్రక్రియ పూర్తైన తర్వాత జూన్ 15 నుంచి అన్ని పాలిటెక్నిక్‌ కాలేజీల్లో తరగతులు ప్రారంభమవుతాయని వివరించారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 87 ప్రభుత్వ, 171 ప్రైయివేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో 29 బ్రాంచ్‌లలో మూడేళ్ల డిప్లొమా కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు.

ఏపీ పాలిసెట్ కౌన్సెలింగ్ ఇలా..

➥ కౌన్సెలింగ్ ఫీజు చెల్లింపు: 25.05.2023 - 01.06.2023.

➥ ధ్రువపత్రాల పరిశీలన: 29.05.2023 - 05.06.2023.

➥ వెబ్‌ఆప్షన్ల నమోదు: 01.06.2023 - 06.06.2023.

➥ వెబ్‌ఆప్షన్లలో మార్పునకు అవకాశం: 07.06.2023.

➥ సీట్ల కేటాయింపు: 09.06.2023.

➥ తరగతుల ప్రారంభం: 15.06.2023.

సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇలా..

ఈ సర్టిఫికేట్లు సిద్ధం చేసుకోండి..

ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించిన అభ్యర్థులు దగ్గరలోని హెల్ప్‌లైన్ సెంటర్లలో సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కోసం హాజరుకాల్సి ఉంటుంది.

 ధ్రువపత్రాల పరిశీలనకు హాజరయ్యే అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికేట్లతోపాటు రెండు జతల జిరాక్స్ కాపీలను తప్పనిసరిగా తమ తీసుకెళ్లా్ల్సి ఉంటుంది.

➥ పాలిసెట్ హాల్‌టికెట్

➥ పాలిసెట్ ర్యాంకు కార్డు

➥ ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు రసీదు

➥ పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హతల మార్కుల మెమో (ఒరిజినల్/ఇంటర్నెట్ కాపీ)

➥ 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్ (లేదా) రెసిడెన్స్ సర్టిఫికేట్ (లేదా) విద్యార్థి తల్లిదండ్రులు స్థానికేతరులు అయితే 10 సంవత్సరాల నుంచి ఏపీలో ఉంటున్నట్లుగా తల్లిదండ్రుల్లో ఎవరికైనా నివాస ధృవీకరణ పత్రం ఉండాలి.

➥ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ (2023-24) మీసేవా నుంచి పొంది ఉండాలి. 

➥ 01.01.2020 తర్వాత పొందిన ఆధాయ ధ్రువీకరణ పత్రం ఉండాలి. ఇది ఉంటేనే ఫీజు రీయింబెర్స్‌మెంట్ పొందడానికి అర్హులు.

➥ బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కుల ధ్రువీకరణ పత్రం తప్పనిసరి.

➥ ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ (టీసీ).

➥ అవసరమైన వారు లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. 02.06.2014 - 01.06.2021 మధ్య తెలంగాణ నుంచి ఏపీకి వలసవచ్చిన వారు తప్పనిసరిగా లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.

➥ అవసరమైన అభ్యర్థులకు పీహెచ్ (PH)/క్యాప్(CAP)/ఎన్‌సీసీ)(NCC)/స్పోర్ట్స్(Sports)/స్కౌట్స్ & గైడ్స్(Scouts & Guides)/ మైనారిటీ (Minority)/ ఆంగ్లో ఇండియన్ (Anglo-Indian) సర్టిఫికేట్లు అవసరం అవుతాయి. నిబంధనల ప్రకారం ఆయా సర్టిఫికేట్లు ఉండాలి.

APPOLYCET-2023 :: Detailed Notification

List of HLC Centers

Manual Option Entry Form

OFFICIAL WEBSITE FOR AP POLYCET-2023 COUNSELLING

ALLOTMENT:

1) Allotments will be placed in Website https://appolycet.nic.in on 09.06.2023 after 06.00 p.m.

2) Enter the LoginId, Hall Ticket number, Password and date of birth in Candidate Login.

3) Download the allotment order and report to the college.

Tuition Fee: Tuition fee payable after allotment is Rs. 4,700/- (for Government and aided Polytechnics) and Rs.25,000/- per anum (in Private unaided Polytechnics and Second Shift Engineering Colleges).

The reimbursement of Tuition fee in respect of all eligible candidates will be as per the orders issued by Government of Andhra Pradesh from time to time.

As per the norms prescribed by the Social Welfare Department, Government of Andhra Pradesh, candidates with maximum eligible age [Candidates of SC/ST/BC-24 YEARS, and OC-20 YEARS] as on 0107-2023 are alone eligible for fee reimbursement.

APPOLYCET-2023 :: Detailed Notification

List of HLC Centers

Manual Option Entry Form

OFFICIAL WEBSITE FOR AP POLYCET-2023 COUNSELLING