APMS Inter Admissions-AP-model-schools-2023-24

 APMS Inter Admissions-AP-model-schools-2023-24

APMS Inter Admissions: ఆదర్శ పాఠశాలల్లో 'ఇంటర్‌' ప్రవేశాలు, మే 22 నుంచి దరఖాస్తుల స్వీకరణ!

ఆంధ్రప్రదేశ్‌‌లోని ఆదర్శ పాఠశాలల్లో 2023-24 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్‌ ప్రవేశాలకు సంబంధించిన ప్రవేశ ప్రక్రియ మే 22 నుంచి ప్రారంభంకానుంది. మే 22 నుంచి జూన్‌ 7 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.

ఆంధ్రప్రదేశ్‌‌లోని ఆదర్శ పాఠశాలల్లో 2023-24 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్‌ ప్రవేశాలకు సంబంధించిన ప్రవేశ ప్రక్రియ మే 22 నుంచి ప్రారంభంకానుంది. ప్రవేశాలు కోరేవారి నుంచి  మే 22 నుంచి జూన్‌ 7 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేష్‌ కుమార్‌ తెలిపారు. ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించి, దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.  

ఏపీ ఆదర్శ పాఠశాలలలో ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. 2023-24 విద్యా సంవత్సరానికిగాను ఈ ప్రవేశాలు చేపట్టనున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోని 164 మోడల్ స్కూల్స్‌లో ప్రవేశాల కోసం ఆన్‌లైన్ ద్వారా ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ గ్రూప్ లకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో సీట్లు పొందినవారికి ఉచిత విద్య అందిస్తారు. ఈ ఆదర్శ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో ఇంటర్ విద్య బోధిస్తారు.

వివరాాలు..

* ఏపీ ఆదర్శపాఠశాలల్లో ఇంటర్ ప్రవేశాలు

అర్హతలు: సంబంధిత జిల్లాల్లో ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్ధులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి.

దరఖాస్తు ఫీజు: ఓసీ, బీసీలకు రూ. 200. ఎస్సీ, ఎస్టీలకు రూ.150.  

ఎంపిక విధానం: 10వ తరగతి మార్కుల మెరిట్, రిజర్వేషన్లు, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపికచేస్తారు

AP MODEL SCHOOLS OFFICIAL WEBSITE

Notification & Schedule  Click Here

Payment

Application / Print Form