Tata Car Offers-new-discounts-offers

 Tata Car Offers-new-discounts-offers

Tata Car Offers: కొత్త కారు కొనే వారికి భారీ శుభవార్త.. రూ.వేలల్లో డిస్కౌంట్!

Tata Cars | మీరు కొత్త కారు కొనేందుకు రెడీ అవుతున్నారా? అయితే మీకు శుభవార్త. భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఈ నెల వరకే ఈ డీల్స్ అందుబాటులో ఉంటాయి.


Car Offers | కారులో తిరగాలని ఉందా? టూవీలర్ కాకుండా కొత్త కారు కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే మీకు శుభవార్త. ఎందుకంటే కారు (Car) కొనుగోలుపై ఇప్పుడు భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. రూ. వేలల్లో తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. 

ఎలా అని అనుకుంటున్నారా? అయితే మీ డీల్స్ గురించి తెలుసుకోవాల్సిందే. 

ప్రముఖ వాహన తయారీ కంపెనీ టాటా మోటార్స్ (Tata Motors) తన మోడళ్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటించింది. ఆఫర్ వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రముఖ హ్యాచ్‌బ్యాక్ కారు టియాగో మోడల్‌పై పలు రకాల ఆఫర్లు ఉన్నాయి. రూ. 20 వేల వరకు క్యాష్ డిస్కౌంట్ లభిస్తోంది. రూ. 10 వేల వరకు ఎక్స్చేంజ్ తగ్గింపు పొందొచ్చు. కార్పొరేట్ డిస్కౌంట్ రూ. 5 వేల వరకు వస్తుంది. అంటే ఈ కారుపై రూ. 35 వేల వరకు తగ్గింపు పొందొచ్చు. 

అలాగే టిగోర్ సెడాన్ కారుపై అయితే రూ. 15 వేల వరకు క్యాష్ డిస్కౌంట్ ఉంది. రూ.10 వేల వరకు ఎక్స్చేంజ్ డిస్కౌంట్ వస్తుంది. రూ. 5 వేల కార్పొరేట్ డిస్కౌంట్ లభిస్తోంది.

ఇంకా టాటా అల్ట్రోజ్ కారుపై కూడా తగ్గింపు లభిస్తోంది. క్యాష్ డిస్కౌంట్ రూ. 10 వేల వరకు వస్తుంది. ఎక్స్చేంజ్ బోనస్ రూ. 10 వేలు ఉంది. ఇంకా కార్పొరేట్ డిస్కౌంట్ రూ. 3 వేలు వస్తుంది. అలాగే నెక్సన్ కారుపైఅయితే కార్పొరేట్ డిస్కౌంట్ మాత్రమే ఉంది. రూ. 3 వేల తగ్గింపు పొందొచ్చు.  

టాటా హరియర్ కారుపై అయితే రూ. 25 వేల వరకు ఎక్స్చేంజ్ బోనస్ ఉంది. రూ.10 వేల కార్పొరేట్ డిస్కౌంట్ వస్తుంది. సఫారి మోడల్‌కు కూడా ఇదే ఆఫర్ వర్తిస్తుంది.

కాగా కంపెనీ అందిస్తున్న ఈ కారు ఆఫర్లు ఈ నెలలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. అంటే జూన్ 30 వరకే డీల్స్ పొందొచ్చు. అంతేకాకుండా ఆఫర్లు అనేవి డీలర్‌షిప్, కారు మోడల్, వేరియంట్, ప్రాంతం ప్రాతిపదికన మారతాయి. అందువల్ల మీరు మీకు దగ్గరిలోని షోరూమ్‌కు వెళ్లి ఆఫర్ పూర్తి వివరాలు తెలుసుకోవడం ఉత్తమం. తర్వాతనే కారు కొనాలా? వద్దా ? అనే నిర్ణయానికి రావొచ్చు.

కేవలం టాటా మోటార్స్ మాత్రమే కాకుండా హోండా, నిస్సాన్ ఇండియా, మారుతీ సుజుకీ వంటి కంపెనీలు కూడా కార్లపై డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటించాయి.