admissions-into-B.Sc(Hons)-in-n.g.ranga-university

 admissions-into-B.Sc(Hons)-in-n.g.ranga-university

ANGRAU: ఎన్జీరంగా వ్యవసాయ వర్సిటీలో బీఎస్సీ కమ్యూనిటీ సైన్స్ కోర్సు, ఇంటర్ అర్హత చాలు

గుంటూరులోని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి బీఎస్సీ (ఆనర్స్) కమ్యూనిటీ సైన్స్ కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది.
గుంటూరులోని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి బీఎస్సీ (ఆనర్స్) కమ్యూనిటీ సైన్స్ కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. ఇంటర్ అర్హత ఉన్న విద్యార్థులు ఆఫ్‌లైన్ విధానంలో సెప్టెంబరు 2లోపు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఇంటర్ మార్కులు,  రిజర్వేషన్ల ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. 

కోర్సు వివరాలు..

బీఎస్సీ(ఆనర్స్) కమ్యూనిటీ సైన్స్

కళాశాల: కాలేజ్ ఆఫ్ కమ్యూనిటీ సైన్స్, లాం, గుంటూరు

కోర్సు వ్యవధి: 4 సంవత్సరాలు.

అర్హత: ఇంటర్మీడియట్ (బైపీసీ/ ఎంపీసీ/ ఎంబైపీసీ). లేదా హోమ్ సైన్స్‌లో డిప్లొమా కోర్సు ఉత్తీర్ణులై అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

B.Sc. (Hons) Community Science: College of Community Science, Lam, Guntur  (ICAR Accredited college)    

వయోపరిమితి: 31.12.2023 నాటికి 17 నుంచి 22 సంవత్సరాల మధ్య ఉండాలి.

రిజిస్ట్రేషన్ ఫీజు: రూ.2000. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.1000 చెల్లిస్తే సరిపోతుంది. 

దరఖాస్తు విధానం: వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు డౌన్‌లోడ్ చేసుకోవాలి. దరఖాస్తు నింపి నిర్ణీత గడువులోగా సంబంధిత చిరునామాకు చేరేలా పంపాలి.

ఎంపిక విధానం: ఇంటర్మీడియట్ మార్కులు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్ ఆధారంగా సీటు కేటాయిస్తారు. 

దరఖాస్తుకు చివరితేది: 02.09.2023.

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
The Registrar, 
Acharya N.G. Ranga Agricultural University, 
Administrative Office, 
Lam, Guntur - 522 034, A.P.

Notification & Application

Website