విశాఖపట్నంలోని డీఆర్‌డీవో-నేవల్ సైన్స్ & టెక్నలాజికల్ ల్యాబొరేటరీ జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు మెకానికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, మెరైన్ ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ విభాగాల్లో బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంఎస్సీతోపాటు నెట్/గేట్ అర్హత ఉన్నవారు దరఖాస్తుకు అర్హులు. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. అభ్యర్థులకు నవంబరు 21, 23 తేదీల్లో వాక్-ఇన్ నిర్వహించనున్నారు
వివరాలు..
జూనియర్ రిసెర్చ్ ఫెలో: 07 పోస్టులు
విభాగాలు: మెకానికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, మెరైన్ ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్.
అర్హత: సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంఎస్సీ, వ్యాలిడ్ నెట్/ గేట్ స్కోరు కలిగి ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
ఇంటర్వ్యూ తేది: 21, 23-11-2023.
వాక్‌ఇన్ వేదిక:
Naval Science & Technological Laboratory,
Vigyan Nagar, Near N.A.D. Junction,
Visakhapatnam, Andhra Pradesh – 530027