CENTRAL SECTOR SCHEME OF SCHOLARSHIP-2023
PRADHAN MANTRI UCHCHATAR SHIKSHA PROTSAHAN (PM-USP) YOJANA GUIDELINES FOR THE COMPONENT SCHEME – CENTRAL SECTOR SCHEME OF SCHOLARSHIP FOR COLLEGE AND UNIVERSITY STUDENTS (PM-USP CSSS) (Applicable for academic year 2022-23 onwards)
Scholarship: పేద విద్యార్థులకు వరం, సెంట్రల్ సెక్టార్ ఉపకారం - చివరితేది ఎప్పుడంటే?
దేశంలోని కళాశాల, విశ్వవిద్యాలయాల విద్యార్థులకు ఆర్థిక భరోసా కల్పించడానికి ఉద్దేశించిన ‘సెంట్రల్ సెక్టార్ స్కాలర్‌షిప్ స్కీమ్’ నోటిఫికేషన్‌ను కేంద్ర ఉన్నత విద్యాశాఖ విడుదల చేసింది.
దేశంలోని కళాశాల, విశ్వవిద్యాలయాల విద్యార్థులకు ఆర్థిక భరోసా కల్పించడానికి ఉద్దేశించిన ‘సెంట్రల్ సెక్టార్ స్కాలర్‌షిప్ స్కీమ్’ నోటిఫికేషన్‌ను కేంద్ర ఉన్నత విద్యాశాఖ విడుదల చేసింది. దీనిద్వారా దేశవ్యాప్తంగా ప్రతి ఏటా మొత్తం 82,000 మంది పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ఉపకార వేతనం అందిస్తారు. వీటిలో 50 శాతం మహిళలకు కేటాయించారు. డిగ్రీ, పీజీ, మెడిసిన్, ఇంజినీరింగ్ కోర్సులు చేస్తున్న విద్యార్థులు అర్హులు. దూరవిద్య కోర్సులు చేస్తున్నవారికి ఈ పథకం వర్తించదు.
వివరాలు...
* సెంట్రల్ సెక్టార్ స్కాలర్‌షిప్ స్కీమ్ 2023-24
స్కాలర్‌షిప్‌ల సంఖ్య: 82,000
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి కనీసం 80 శాతం మార్కులతో ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. గుర్తింపు పొందిన కళాశాలల్లో డిగ్రీ లేదా పీజీ కోర్సులు చదువుతుండాలి. కుటుంబ వార్షిక ఆదాయం రూ.4.5 లక్షలకు మించకూడదు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: మెరిట్ ఆధారంగా.
స్కాలర్‌షిప్: ఒక్కో విద్యార్థికి అయిదేళ్ల వరకు ఉపకారవేతనం అందిస్తారు. డిగ్రీ స్థాయిలో మూడేళ్లపాటు ఏటా రూ.12,000; పీజీ స్థాయిలో రెండేళ్లపాటు ఏటా రూ.20,000 చెల్లిస్తారు. బీఈ/ బీటెక్ కోర్సుల్లో చేరినవారికి మొదటి మూడేళ్లు ఏటా రూ.12,000; చివరి ఏడాది రూ.20,000 ఇస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 31.12.2023.