which-is-best-Black Tea or Black Coffee-uses

 which-is-best-Black Tea or Black Coffee-uses

Black Tea or Black Coffee: బ్లాక్‌ టీ లేదా బ్లాక్‌ కాఫీ.. వీటిల్లో ఆరోగ్యానికి ఏది మంచిది?

ఆరోగ్య స్పృహ ఉన్న వారు టీ, కాఫీలను చక్కెర, పాలతో తాగడానికి దూరంగా ఉంటారు. బదులుగా బ్లాక్ టీ లేదా బ్లాక్ కాఫీని తాగేందుకు ప్రాధాన్యత ఇస్తారు. రెండు పానీయాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే ఈ రెండిటిలో ఏది మంచిదో.. ఆరోగ్య పరంగా ఏది మంచిదో.. అనే విషయం చాలా మందికి తెలియదు. నిపుణులు ఏం చెబుతున్నారంటే.. బ్లాక్ టీ లేదా బ్లాక్ కాఫీ ఈ రెండింటిలోనూ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్‌తో పోరాడడం ద్వారా చర్మ కణాలను
ఆరోగ్య స్పృహ ఉన్న వారు టీ, కాఫీలను చక్కెర, పాలతో తాగడానికి దూరంగా ఉంటారు. బదులుగా బ్లాక్ టీ లేదా బ్లాక్ కాఫీని తాగేందుకు ప్రాధాన్యత ఇస్తారు. రెండు పానీయాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే ఈ రెండిటిలో ఏది మంచిదో.. ఆరోగ్య పరంగా ఏది మంచిదో.. అనే విషయం చాలా మందికి తెలియదు. నిపుణులు ఏం చెబుతున్నారంటే..
బ్లాక్ టీ లేదా బ్లాక్ కాఫీ ఈ రెండింటిలోనూ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్‌తో పోరాడడం ద్వారా చర్మ కణాలను రక్షిస్తాయి. అయితే బ్లాక్ టీలో కనిపించే యాంటీఆక్సిడెంట్ బ్లాక్ కాఫీ కంటే చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి
బ్లాక్ టీలో ఫ్లేవనాయిడ్స్, పాలీఫెనాల్స్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి అనేక ప్రాణాంతక వ్యాధులతో పోరాడటానికి సహాయపడతాయి. బ్లాక్ కాఫీలో కెఫిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది కొంతమందికి హానికరం. బ్లాక్ టీలో కెఫిన్ చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది.
బ్లాక్ కాఫీలో కెఫీన్ ఎక్కువగా ఉండటం వల్ల తక్షణ శక్తిని ఇస్తుంది. వ్యాయామం లేదా వ్యాయామానికి ముందు ఎనర్జీ లెవల్స్ పెంచుకోవడానికి దీనిని తాగొచ్చు. అందుకే జిమ్‌కి వెళ్లే ముందు చాలా మంది బ్లాక్ కాఫీ తాగుతుంటారు. బ్లాక్ కాఫీ కంటే బ్లాక్ టీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.
బ్లాక్ టీలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కెఫిన్ తక్కువగా ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి, ఫిట్‌నెస్‌కు మంచిది. అయితే రెండింటిలో ఏదైనా అధికంగా వినియోగిస్తే ఆరోగ్యినికి అంత మంచిది కాదంటూ నిపుణులు సూచిస్తున్నారు.