contract-employees-service-regularization-details

 contract-employees-service-regularization-details
నిరుద్యోగులకు, కాంట్రాక్ట్ ఉద్యోగులకు జగన్ సర్కార్‌ గుడ్‌న్యూస్‌.. ఉత్తర్వులు జారీ
ఏపిలో కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల.*
 జూన్ 2, 2014 నాటికి Full Time కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియమించబడి, ఈరోజు వరకు పనిచేస్తున్న వారు రెగ్యులరైజ్ అవుతారు. అలా క్రమబద్ధీకరించబడిన వారు NPS (CPS) పరిధిలోకి వస్తారు. పూర్తి వివరాలు, ఉత్తర్వుల కాపీ పేజీలో కలవు.*
కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజ్ :*

కాంట్రాక్ట్ ఉద్యోగులకు శుభవార్త. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల అసెంబ్లీ పాస్ చేసిన బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపడంతో గెజిట్ జారీ చేశారు. దీంతో ప్రభుత్వంలోని 177 శాఖల్లో 2014 జూన్ రెండో తేదీ నాటికి చేరిన 10,117 మంది రెగ్యులరైజ్ అయ్యారు

ఏపీలో జగన్ మోహన్ రెడ్డి సర్కార్ దసరాకు డబుల్ ధమాకా ప్రకటించింది. ఒకటేమో నిరుద్యోగులకు, మరొకటి కాంట్రాంక్టు ఉద్యోగులు.. ఇద్దరికీ పండుగ వేళ శుభవార్త వినిపించింది. ఈ మేరకు.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు గవర్నర్ ఆమోదం.*

★ ACT No. 30 of 2023 విడుదల.
★ జూన్ 2, 2014 నాటికి Full Time కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియమించబడి ఉండాలి.
★ అలా క్రమబద్ధీకరించబడిన వారు NPS (CPS) పరిధిలోకి వస్తారు.
ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు జగన్ సర్కారు గుడ్ న్యూస్ వినిపించింది. రాష్ట్రంలో ఉద్యోగాలను భర్తీ చేసే ప్రక్రియలో భాగంగా.. గ్రూప్-2లో అదనంగా 212 పోస్టులను పెంచుతూ వైసీపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జీవో కూడా విడుదల చేసింది. అయితే.. గతంలోనే గ్రూప్-2లో 508 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా.. పోస్టుల సంఖ్య పెంచాలని నిరుద్యోగుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ రావటంతో.. వారి అభ్యర్థనకు సీఎం జగన్ సానుకూలంగా స్పందించారు
సీఎం జగన్ ఆదేశాలతో.. అన్ని విభాగాలలోని ఖాళీల వివరాలను మరోసారి పరిశీలించిన జీఏడీ.. మరో 212 పోస్టులు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 
ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. దీంతో.. మొత్తం 720 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది ప్రభుత్వం.

కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ..

మరోవైపు.. ఏపీలో కాంట్రాక్టు ఉద్యోగులకు దసరా పండుగ వేళ జగన్ సర్కార్ తీపి కబురు వినిపించింది. కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరణ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన అసెంబ్లీ బిల్లుకు గెజిట్‌ను గవర్నర్ అబ్దుల్ నజీర్ జారీ చేశారు. కాగా.. కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ ప్రక్రియకు తీసుకున్న నిర్ణయంపై సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
FOR MORE DETAILS CLICK HERE