s.a-2-cba-3-exams-2024-telugu-model-papers

 s.a-2-cba-3-exams-2024-telugu-model-papers
ఏప్రిల్ 6 నుండి 19 వరకు 9.00 am to 12.00 noon పరీక్షలు నిర్వహించాలి.
 Answer scripts evaluation up to 21.04.2024
 Issue of Progress cards and submission of Promotion lists up to 23.04.2024. 
 If general elections fall in above days the modified dates will be announced for those exams.
 Download SA 2 / CBA 3 Time Table April 2023-24 from Class 1 to Class 9
1st to 5th Class CBA-3 TIME TABLE
06-04-2024 TELUGU (9 AM TO 12PM) 
08-04-2024 ENGLISH PART-A
10-04-2024 ENGLISH PART-B (TOEFL EXAM)
12-04-2024  MATHS
13-04-2024  EVS (3rd, 4th, 5th Classes)
6th, 7th, 8th Class, 9th Class  S.A-2/CBA-3 EXAMS TIME TABLE
06-04-2024 TELUGU (9 AM TO 12PM) 
08-04-2024 HINDI
10-04-2024 ENGLISH PART-A
12-04-2024 ENGLISH PART-B (TOEFL EXAM)
13-04-2024 MATHS
15-04-2024 GENERAL SCIENCE/PHYSICAL SCIENCE
16-04-2024 BIOLOGICAL SCIENCE
18-04-2024 SOCIAL
SYLLABUS : TOTAL TEXT BOOK ALL CHAPTERS.
CBA-3 EXAMS BLUEPRINT & MODEL PAPERS FOR 6TH CLASS, 7TH CLASS, 8TH CLASS
SKILLS
Identifies and uses synonyms, antonyms and word meanings in context - 4 X 2M =8 MARKS

Understands the usage of grammar concepts  - 4 X 2M = 8 MARKS

Identifies and recalls direct facts in the passage 6 X 2M = 12 MARKS
Analyses and infers hidden ideas in the passage 4 X 2M = 8 MARKS
Knows punctuation and constructs grammatically correct sentences

Expresses ideas coherently on a given topic by writing sentences and completes description of an incident/story using given word clues - 2 X 2M = 4 MARKS  (TOTAL = 40 MARKS)

FRs QUESTIONS 8 (40 MARKS)
 
6TH CLASS TELUGU MODEL PAPERS CLICK HERE
7TH CLASS TELUGU MODEL PAPERS CLICK HERE
8TH CLASS TELUGU MODEL PAPERS SET-1  CLICK HERE
8TH CLASS TELUGU MODEL PAPERS SET-2  CLICK HERE
S.A-2 EXAMS BLUE PRINT& MODEL PAPERS FOR 9TH CLASS
పదవ తరగతి తెలుగు పరీక్ష మోడల్ లో ఈ 9వ తరగతి తెలుగు పరీక్ష వుంటుంది.
మొత్తం 100 మార్కులకు జరిగే ప్రథమ భాష తెలుగు పరీక్షలో మూడు విద్యా ప్రమాణాల ద్వారా విద్యార్థుల సామర్ధ్యాలను మదింపు చేస్తారు. అందులో  
1. అవగాహన - ప్రతిస్పందన (32 మార్కులు)
2. వ్యక్తీకరణ - సృజనాత్మకత (36మార్కులు)
3. భాషాంశాలు (32మార్కులు) ఉంటాయి.
1) మొదటి విద్యా ప్రమాణమైన అవగాహన - ప్రతిస్పందనలో 4 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కొక్కదానికి 8 మార్కులు.  మొత్తం 32 మార్కులు.
 ఇందులో 1వ ప్రశ్న పరిచిత పద్యాలకు సంబంధించిన ప్రశ్న. ఏవేని రెండు పద్య పాఠ్యాంశాల నుండి రెండు పద్యాలను ఇచ్చి ఒకదానికి అడిగిన విధంగా 4 ప్రశ్నలకు సమాధానాలు రాయమంటారు. 
2) రెండవ విద్యా ప్రమాణమైన వ్యక్తీకరణ - సృజనాత్మకతలో మూడు ప్రశ్నలు లఘు సమాధానాలవి, మరో మూడు ప్రశ్నలు వ్యాసరూప సమాధానాలవి. ఒక్కో లఘు సమాధానానికి 4మార్కుల చొప్పున 12 మార్కులు. వ్యాసరూప సమాధానానికి 8 మార్కుల చొప్పున 24 మార్కులు.
3) మూడవ విద్యా ప్రమాణమైన భాషాంశాలకు సంబంధించిన ప్రశ్నలన్నీ దాదాపుగా పాఠాలకు వెనుకనున్న, పాఠ్యపుస్తకం చివరగల అంశాలను తప్పనిసరిగా చదవాలి...
సంగ్రహ నాత్మక పరీక్ష-2 S.A-2  :తెలుగు, 9వ తరగతి
     100 మార్కులు. 
రచన: డా,,టి.సి. గురివి రెడ్డి, 
పాఠశాల సహాయకులు: తెలుగు,
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, రుద్రం పేట,
అనంతపురం జిల్లా.
-------++++-++++------++----+++---+++---+++-
                 విభాగం:1.           ( 32మార్కులు)
1) కింది పరిచిత పద్యాలలో ఒక్క దానిని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులిమ్ము.     సర్వతీర్థాభిగమనంబు, సర్వ వేద
సమధి గమము సత్యంబుతో సరియుగావు
ఎరుగుమెల్ల ధర్మంబులకెందు బెద్ద 
యండ్రు సత్యంబు ధర్మజ్ఞులైన మునులు 
ప్రశ్నలు:
1.సత్యానికి సాటి రానివి ఏవి?
2. సత్యమే శ్రేష్టమన్నది ఎవరు?
3. సర్వ జగత్తుకు మూలమేది?
4. పై పద్యము నుండి ఒక ప్రశ్న తయారు చేయండి?
                 ( లేదా)
దళమైన పుష్పమైనను
ఫలమైనను సలిలమైన బాయని భక్తిన్ 
గొలిచిన జనులర్పించిన
నెలమిన్ రుచిరాన్నముగానే యేను భుజింతున్.
1. ఈ పద్యములో గల బాల్య మిత్రులు ఎవరు?
2. శ్రీకృష్ణుని సేవించుటకు ఏమి అవసరం?
3. శ్రీకృష్ణ భగవానుడు వేటిని ఇష్టంగా స్వీకరిస్తారు?
4. పై పద్యం ఆధారంగా ఒక ప్రశ్నను తయారు చేయండి?
2) క్రింది పరిచిత గద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబు లిమ్ము. (8మార్కులు)
తెలుగు నాట నాటక రంగంలో ఎన్నో రకాలుగా రూపాంతరాలు చెందింది. పౌరాణిక, సాంఘిక, జానపద నాటకాలు, మూకాభినయం ,రంగస్థలం, వీధి నాటకాలు ఏకాంకితలు ,ఏకపాత్రలు ఇలా ఎన్నో రూపాలలో నాటకాలు ప్రదర్శిస్తామవుతున్నాయి. నాటక ప్రదర్శన అనేక కళల సమాహారం. కేవలం నటులు మాత్రమే కాకుండా మేకప్ ,లైటింగ్ ,మ్యూజిక్ మొదలైనవి కూడా నాటక ప్రదర్శనను రక్తి కట్టిస్తాయి. 'మంజరీ మధుకరీయం 'తొలి తెలుగు నాటకం. శ్రీ కోరాడ రామచంద్ర శాస్త్రి గారు దీన్ని రాశారు. తర్వాత కాలంలో శ్రీ వావిలాల వాసుదేవశాస్త్రి గారు షేక్స్పియర్ "జూలియస్ సీజర్ నాటకాన్ని" సీజర్ చరిత్ర" అని పేరుతో ఆంధ్రీకరించారు. ధర్మవరం రామకృష్ణమాచార్యులు" చిత్రనలియం' నాటకాన్ని రాసి ప్రదర్శించారు.
ప్రశ్నలు:
1. తొలి తెలుగు నాటకం ఏది?
2. అనేక కలల సమాహారం ఏది?
3. చిత్ర నలియం నాటకాన్ని రాసినది ఎవరు?
4. ఏదిని ఒక అర్థవంతమైన ప్రశ్నను తయారు చేయండి?
3) ఉపవాచకము నుండి ఇచ్చిన క్రింది సంఘటనలు ఏఏ పాఠ్యాంశమునకు చెందినవో రాయండి.(8మార్కులు)
అ. 1878వ సంవత్సరములో ది హిందూ పేరుతో ఒక ఆంగ్ల దినపత్రికను స్థాపించారు.
ఆ. 192వ సంవత్సరంలో దాస్ నారాయణరావుతో కలిసి కృష్ణా పత్రికను ప్రారంభించారు.
ఇ. కాశీనాథుని నాగేశ్వరరావు 1867వ సంవత్సరం మే నెల ఒకటో తేదీన కృష్ణాజిల్లా ఎలక్షన్ లో జన్మించారు.
ఈ. స్వాతంత్ర పోరాటంలో పాల్గొని జైలు శిక్షణకు గురి అయ్యి తొలి తెలుగు మహిళా దువ్వూరి సుబ్బమ్మ.
4) క్రింది కరపత్రాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.( 8మార్కులు)
మహాశయ!
               ఈ ప్రకృతి మన అందరిదీ .ప్రకృతిలో భాగమైనందుకు దానిని ఉపయోగించుకునే హక్కుతో పాటు ప్రకృతిని రక్షించే బాధ్యత కూడా మన అందరికీ ఉంది. ప్రకృతిలో ఉండే వనరుని మనమందరం మన అవసరాలకు వాడుకుంటున్నాం. అందుకే ప్రకృతిని రక్షించండి.స్వచ్ఛమైన ప్రకృతిని కాలుష్యంతో పాడు చేయకండి.
ప్రకృతిని ప్రేమిద్దాం ::ప్రశాంతంగా జీవిద్దాం.
                                                      ఇట్లు,
                                       ప్రకృతి పరిరక్షణ సంస్థ,
                                             రుద్రం పేట.
ప్రశ్నలు:
1. కరపత్రం దీనిని కాపాడమని సూచిస్తుంది?
2. కరపత్రములు చెప్పిన నినాదం ఏది?
3. ఈ కరపత్రాన్ని ప్రచురించింది ఎవరు?
4. పై కరపత్రం ఆధారంగాఒక ప్రశ్న తయారుచేయండి
                  విభాగం::2.      (36మార్కులు)
11. వ్యక్తీకరణ- సృజనాత్మకత .
    క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో జవాబులు రాయండి. (3×4:12 మార్కులు)
5. నన్నయ భట్టు గురించి రాయండి?
6. ప్రియమైన నాన్నకు లేఖప్రక్రియను పరిచయం చేయండి?
7. పొనకా కనకమ్మ పాత్ర స్వభావం రాయండి?
క్రింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాలలో జవాబులు రాయండి.       (3×8::24మార్కులు)
8. ధర్మబోధ పాఠ్యభాగ సారాంశం రాయండి?
                    (   లేదా)
హరివిల్లు పాఠంలో సూర్యోదయ ,సూర్యాస్తమయం కవులు ఎలా వర్ణించారో మీ సొంతమాటల్లో రాయండి
9. స్వాతంత్ర ఉద్యమ పోరాటంలో కోటిరెడ్డి గారి పాత్ర ఏమిటి?  (    లేదా)
ఖద్దరు ఇస్మాయిల్ వ్యక్తిత్వాన్ని నిరూపించండి?
10) గౌతముడు, దేవదత్తుడుల సంభాషణను రాయండి.(లేదా)
ఆశావాదివారి జీవన ప్రస్థానం తెలుసుకున్నారు కదా మీరు తెలుసుకున్న విషయాలను మీ మిత్రునికి లేఖ రూపంలో రాయండి.
       విభాగం::3.   (32మార్కులు)
111.భాషాంశాలు:పదజాలం - వ్యాకరనాంశాలు)
కింది ప్రశ్నలకు సూచించిన విధంగా జవాబులు రాయండి.(9×2::18మార్కులు)
11. పుట్టు గ్రుడ్డిగా పోకురా
     ఓ కవి ! వట్టి మ్రోడవు కాకురా!  (   2మార్కులు)
పై వాక్యము లోని అలంకారాన్ని గుర్తించి రాయండి.
12. ఈయది శాస్త్ర ధర్మమొక యింత సహించిన లోక ధర్మమిం.                                 (2మార్కులు)
గురులఘువులు గుర్తించి గణ విభజన చేసి ,
పద్యం పేరు రాయండి.
13 అ)ఆమె నటనకు ప్రేక్షకులు హర్షద్వానాలు చేశారు.
                                         ----------------------
(గీత గీసిన పదానికి అర్థం రాయండి) 2మార్కులు
ఆ.దృష్టిలోపము ఉన్నవారు సరిగా చదవలేరు.
      ---------
(గీత గీసిన పదానికి సరైన అర్థాన్ని గుర్తించి రాయండి)
అ.చూపు ఆ.దిష్టి ఇ.కన్ను ఈ.మిన్ను
14. అ) నీటిని వృధా చేయరాదు.(2మార్కులు)
         _-----------
(గీత గీసిన పదానికి పర్యాయపదాలు రాయండి)
ఆ) ఆత్మలో గరళంబు నంగిట నమృతంబు.
                                             ---------+++++
(గీత గీసిన పదానికి సరి అయిన పర్యాయపదాన్ని గుర్తించి రాయండి)
అ. సుధా ,పాలు. ఆ. నీళ్లు పాలు ఇ. పాలు పెరుగు ఈ. నీళ్లు అమృతం.
15అ)విద్దే లేనివాడు వింత పశువు. (2మార్కులు)
     --------
(గీత గీసిన పదానికి ప్రకృతి పదం రాయండి)
ఆ. ఎంత దవ్వు నడవాలి.
             -----+----
(గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించి రాయండి)
అ.దూరము ఆ.దగ్గర ఇ.తీరం ఈ.దిరం
16. అ) ఆకాశములో తారలు ఉన్నాయి. తారలు
                              ------------                ---------++
మెల్లమెల్లలాడుతున్నాయి. (2మార్కులు)
(గీత గీసిన పదానికి నానార్థాలు రాయండి)
ఆ. కవికి సామాజిక స్పృహ అవసరం.
    --------++
(గీత గీసిన పదానికి సరైన నానార్థాలను గుర్తించి రాయండి)
అ. కవిత్వం రాసేవాడు. నీటి కాకి.
ఆ. కవిత్వం రాయినివాడు, పాలు తాగేవాడు.
ఇ. కవి కాలుడు. ఈ.కాలం,కవి
17) మా పౌత్రుడు చాలా మంచివాడు(2మార్కులు)
           ----------+-+--
(గీత గీసిన పదానికి వ్యుత్పత్త్యర్థంరాయండి.)
ఆ. ఆ పురంద్రి పేరు పార్వతి.
      ----------------
(గీత గీసిన పదానికి సరి అయిన వ్యుత్పత్యార్థము గుర్తించి రాయండి)
అ. గృహాన్ని బాగు చేయునది(భార్య)
ఆ. గృహన్న ధరించేది (ఇల్లాలు)
ఇ. కానీ వదిలేయినది (స్త్రీ)
ఈ. గృహాన్ని విడిచిపెట్టినది (ఆడది)
18. శ్రీరామ సుగ్రీవుల మైత్రి అందరికీ కన్నుల పండుగలా ఉంది.      (2మార్కులు)
(ఈ వాక్యము లోని జాతీయాన్ని గుర్తించి విడిగా రాయండి)
19. పిచ్చుకపై బ్రహ్మాస్త్రం (2మార్కులు)
(జాతీయాన్నిఏ అర్థంలో/ సందర్భంలో ఉపయోగిస్తారో రాయండి)
క్రింది ప్రశ్నలకు సూచించిన విధముగా జవాబులు రాయండి.               ( 14×1:: 14మార్కులు)
20. రాజు కొలువు సేసి ఉన్నాడు.   
               --------+-++++.               1మార్కు)
(గీత గీసిన పదాన్ని విడదీసి రాయండి)
21. ధీర+ఆలు ( సంధి పదాలను కలిపి రాయండి) 1
22. నేడు ఉత్తరాలు రాయడం లేదు. 1మార్కు
              -------------++---
(గీత గీసిన పదం ఏ సంధికి చెందిందో గుర్తించి రాయండి)
అ. గుణ సంధి ఆ.లులనలసంధి ఇ.ఉత్వసంది ఈ. సవర్ణ దీర్ఘ సంధి
23. రాజుల సభలో కళా గోష్టి జరుగును. 1మార్కు
                           ----++++---
(గీత గీసిన పదానికి విగ్రహ వాక్యం రాయండి)
24. నేను బెర్లిన్ నగరానికి వెళ్లాను.    1మార్కు
            ---------------------+++
(గీత గీసిన పదం ఏ సమాసమో గుర్తించండి)
అ)సంభావన పూర్వపద కర్మధారయ సమాసం
ఆ) ద్వంద్వ సమాసం ఇ).ద్విగు సమాసం
ఈ.) షష్టి తత్పురుష సమాసం.
25) ఆనంద మనునది అనుభవమునకు వచ్చునది కాదు.                     (  1మార్కు)
(ఈ వాక్యానికి సరియైన ఆధునిక వచనాన్ని గుర్తించి రాయండి)
అ. ఆనందం అనుభవ హీనం
ఆ. ఆనందం అనేది అనుభవానికి హీనం
ఇ. ఆనందమే అనుభవైకా వేద్యం
ఈ. ఆనందం అనేది అనుభవానికి వచ్చేది కాదు.
26) నేను స్నేహితులతో కలిసి ఊరికి వెళ్లాను. 1మా
(ఈ వాక్యానికి వ్యతిరేకార్థక వాక్యము రాయండి)
27. క్రింది పదాలలో వ్యతిరేకార్థక క్రియను గుర్తించండి
అ.చేసి  ఆ.చేయక  ఇ.చేస్తూ  ఈ.చేస్తే
28) సుధాచదువుతూ, టీవీ చూస్తున్నది. 1మార్కు
(ఇది ఏ రకమైన సంక్లిష్ట వాక్యము రాయండి)
29) హరిత కవిత రాసింది.          1మార్కు
(సరి యైన కర్మణి వాక్యాన్ని గుర్తించండి)
అ. హరిత కవితను రాస్తున్నది
ఆ. హరితచే కవిత రాయబడ్డది
ఇ. హరిత కవితను రాయాలనుకున్నది
ఈ. హరిత కవిత రాయలేదు.
30) మీకు అవార్డు వచ్చిందా?
అ. ప్రశ్నార్థక వాక్యం ఆ. నిశ్చయార్థకవాక్యం
ఇ. వ్యతిరేకార్థక వాక్యం ఈ. ఆశీర్వాదకం.
31) మీరు 1000 మొక్కలు నాటాలి.  1మార్కు
(ఇది ఏ రకమైన సామాన్య వాక్యము గుర్తించండి)
అ. ప్రశ్నార్థకం     ఆ. నిషేధార్ధక వాక్యం
ఇ. విద్యర్థక వాక్యం ఈ. సోమర్థ్యార్థక వాక్యం
32) మీరు గట్టిగా అరవవద్దు.   1మార్కు
(ఇది ఏ రకమైన సామాన్య వాక్యము గుర్తించండి)
33) ఆమె డాక్టరు.               1మార్కు
అ. ఆశ్చర్యార్థక వాక్యం  ఆ. నిశ్చ యార్థకవాక్యం
ఇ. విద్యర్థక వాక్యం ఈ. ప్రశ్నార్ధక వాక్యం
9TH CLASS TELUGU MODEL PAPERS CLICK HERE