Implementation-Parent-Teacher -Home-visit-program

 Implementation-Parent-Teacher -Home-visit-program
School  Education  -   Enhancing  the Academic  Performance  of  students studying  from  Classes  1-12  in Government   Schools  and  Colleges Implementation   of "Parent-Teacher  Home  Visit  Program"   in  the  State from the  Academic Year  2024-25  -  Orders  -  Issued.
AP Parent-Teacher Home Visit Program 2024-25 GO 26*
 1 నుండి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల విద్యా పనితీరును పెంపొందించడానికి 2024-25 విద్యా సంవత్సరం నుండి అన్ని ప్రభుత్వ పాఠశాలలు మరియు కళాశాలల్లో "తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల గృహ సందర్శన కార్యక్రమం" ని అమలు చేయవలసి ఉంది.  అమలు కోసం షెడ్యూల్
ఉపాధ్యాయులు విద్యార్ధుల తల్లితండ్రులను ఏడాదికి రెండు సార్లు ఇంటికి వెళ్ళి కలిసే కార్యక్రమ విధివిధానలు విడుదల 
▪️జూన్ మరియు జనవరి నెలలో తల్లితండ్రులను కలవాలి 
▪️విద్యార్ధుల ప్రగతి, అవసరాలు తదితర విషయాలు చర్చించాలి 
▪️పూర్తి వివరాలు, జీవో కాపీ కింది వెబ్ పేజీ క్లిక్ చేసి చూడవచ్చు 
FOR MORE DETAILS G O Ms No 26 CLICK HERE
విద్యార్థుల ఇళ్లకు ఉపాధ్యాయులు
2024-25 విద్యా సంవత్సరం నుంచి అమలు
విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఆదేశాలు
 ఇకపై.. విద్యార్థుల ఇళ్లకు ఉపాధ్యాయులు వెళ్లను న్నారు. ఉపాధ్యాయులు వెళ్లి విద్యార్థుల తల్లిదండ్రులతో బోధన తీరు, తీసు కోవాల్సిన జాగ్రత్తల గురించి చర్చించాలంటూ రాష్ట్రప్రభుత్వం శుక్రవారం ఉత్త ర్వులు జారీచేసింది. 2024-25 విద్యాసంవత్సరం నుంచి 'పేరెంట్ టీచర్- హోం-విజిట్' పేరుతో ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఒకటి నుంచి 12వ తర గతి వరకు బోధన జరిగే అన్ని పాఠశాలలు, కళాశాలల్లో అమలుచేయాలని విద్యాశాఖ కమిషనర్ను విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఆదేశిం చారు. 'విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే జూన్లో ఒకసారి, జనవరిలో మరోసారి తరగతి ఉపాధ్యాయులు విద్యార్థుల ఇళ్లకు వెళ్లాలి. తొలివిడత సందర్శనలో విద్యార్థుల ప్రతిభ మెరుగుపరిచేందుకు సిద్ధం చేసిన ప్లాన్ గురించి తల్లిదండ్రులకు వివరించాలి. మలివిడత సందర్శనలో అప్పటి వరకు తరగతి గదిలో జరిగిన బోధన, విద్యార్థుల ప్రతిభకు తగ్గట్లు ప్లాన్ తయారు చేసుకోవాలి. తల్లిదండ్రులకు అనుకూలంగా ఉండే వేళల్లోనే ఇళ్ల సందర్శన జరగాలి' అని ముఖ్యకార్యదర్శి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రెగ్యులర్ విధులకు అవరోధం లేకుండా ఉపాధ్యాయుల ఇళ్ల సందర్శన జరగాలని, ఇళ్లకు ఉపా ధ్యాయులు వెళ్లి తల్లిదండ్రులతో చర్చించడం ద్వారా విద్యార్థుల ప్రతిభ మరింత మెరుగుపడుతుందని తెలిపారు.