ANGRAU-agricultural-diploma-Admissions-2024
ANGRAU Admissions : అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కోర్సులకు నోటిఫికేషన్ విడుదల - జూన్ 1 నుంచి రిజిస్ట్రేషన్లు
ముఖ్యమైన తేదీలు
దరఖాస్తు చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ జూన్ 1న ప్రారంభం అవుతుంది. అలాగే రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ జూన్ 20 అని ఆచార్య ఎన్‌జి రంగా యూనివర్శిటీ తెలిపింది. దరఖాస్తు చేసే విధానం ఆన్‌లైన్‌లో ఉంటుంది.
Acharya NG Ranga Agricultural University Updates : ఉమ్మడి గుంటూరు జిల్లాలోని లాంలో ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ యూనివర్శిటీ అగ్రికల్చరల్ పాలిటెక్నిక్ కోర్సులకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ కోర్సులకు ప్రవేశ పరీక్ష లేకుండా, పదో తరగతిలో వచ్చిన మార్కులు ఆధారంగానే సీట్లు కేటాయింపు ఉంటుంది. ఈ డిప్లొమా కోర్సులకు జూన్ 1 నుంచే రిజిస్ట్రేషన్ ప్రారంభం అవుతుంది. ఈ కోర్సులు చదవాలనుకునే ఆసక్తి గల విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
Fee structure (For academic year, 2024-25) :
Fee to be paid at the time of admission (in Rs.) for all the Diploma programmes * I year - I Semester Government - Rs. 22,460.00 (Refundable deposit Rs.11,700.00 after completion)
I year - II Semester - Rs. 6710.00
Affiliated* Rs. 27,099.00 23,459.00
ఎన్‌జి రంగా వ్యవసాయ యూనివర్శిటీ 2024-25 సంవత్సరానికి గానూ యూనివర్శిటీ ఆధ్వర్యంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీల్లో డిప్లొమా కోర్సుల ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఈ కోర్సులు చేయడానికి పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు అర్హులు. పదో తరగతి పాసైన విద్యార్థులు యూనివర్శిటీ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఎలా చేసుకోవాలి…?
పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు యూనివర్శిటీ వెబ్‌సైట్ https://angrau.ac.in ను సందర్శించాలి. అందులోకి వెళ్లి ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాలి. అలాగే ఫీజుల విషయానికి వస్తే, జనరల్, ఓబీసీ విద్యార్థులకు దరఖాస్తు ఫీజు రూ.600, అలాగే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.300 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
కోర్సులు?
- విత్తన సాంకేతిక పరిజ్ఞానం రెండేళ్లు
- సేంద్రియ వ్యవసాయం రెండేళ్లు
- పంటలు నిర్వహణ రెండేళ్లు
- పంటలు విస్తరణ రెండేళ్లు
- అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ మూడేళ్లు
Registration form for Admission into 2/3 years Diploma Courses 2024-25 CLICK HERE కోర్సుల్లో ప్రవేశాలు ఎలా?
ఈ కోర్సుల్లో ప్రవేశాలకు ఎటువంటి ప్రవేశ పరీక్ష లేదు. అకాడమిక్ మెరిట్ ఆధారంగానే ఉంటుంది. పదో తరగతిలో వచ్చిన మార్కులు ఆధారంగానే ప్రవేశాలు జరుగుతాయి. పదో తరగతిలో వచ్చిన మార్కులను మెరిట్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థులై ఉండాలి. విద్యార్థి తప్పని సరిగా గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఇంటర్మీడియట్, అంతకంటే ఎక్కువ విద్యార్హతలు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు. విద్యార్థులు వారి పదేళ్ల విద్యా కాలంలో కనీసం నాలుగేళ్లు గ్రామీణ ప్రాంత పాఠశాలల్లో చదివి ఉండాలి. వయస్సు 15-22 ఏళ్ల మధ్య ఉండాలి.
OFFICIAL WEBSITE LINK CLICK HERE
ONLINE REGISTRATION LINK CLICK HERE