SBI-MINI-STATEMENT-THROUGH-MISSED-CALL-DETAILS

 SBI-MINI-STATEMENT-THROUGH-MISSED-CALL-DETAILS

SBI: ఒక్క నంబర్‌కు మిస్డ్ కాల్‌తో బ్యాంక్ మినీ స్టేట్‌మెంట్.. క్షణాల్లో ఫోన్‌కు మెసేజ్.. ఇప్పుడే ట్రై చేయండి

SBI: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. భారత్‌లో అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు. కస్టమర్లకు ఎన్నో రకాల సేవలను అందిస్తుంటుంది. బ్యాంక్ అకౌంట్లను తెరిపించడం, దానికి వడ్డీ జమ చేసి కస్టమర్లకు అందించడం, ఎఫ్‌డీ, పాస్‌బుక్ సేవలు ఇలా ఎన్నో అందుబాటులో ఉంటాయి. ఇక కస్టమర్ల సౌలభ్యం కోసం .. బ్యాంక్ బ్రాంచులను భౌతికంగా సంప్రదించే అవసరం లేకుండానే.. SMS ఫెసిలిటీ, నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ సహా ఎన్నో రకాల సేవల్ని ఆఫర్ చేస్తుంది. బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందో తెలుసుకోవడం సహా.. అమౌంట్ ట్రాన్స్‌ఫర్ చేసేందుకు ఇలా కొత్త కొత్త ఫీచర్లను కస్టమర్లకు ఎప్పటికప్పుడు పరిచయం చేస్తుంటుంది. 
బ్యాంక్ సేవలకు సంబంధించి కస్టమర్లు ఎక్కువగా తెలుసుకోవాల్సింది బ్యాంక్ మినీ స్టేట్‌మెంట్ గురించి.
బ్యాంక్ మినీ స్టేట్‌మెంట్‌తో మనం చేసే ట్రాన్సాక్షన్స్ అన్నింటి వివరాలు తెలుసుకోవచ్చు. ఎప్పుడు ఎంత ఖర్చు చేస్తున్నాం. బ్యాంక్ ఎలాంటి ఛార్జీలు విధిస్తుంది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఎంత ఖర్చు చేస్తున్నాం. ఎంత మిగులుతుంది.. మొత్తం బ్యాలెన్స్ ఎంత ఉంది.. వంటి వివరాలన్నీ తెలుసుకోవచ్చు. అందుకే బ్యాంక్ స్టేట్‌మెంట్ అనేది అందరికీ అవసరమే.

ఇక SBI బ్యాంక్ మినీ స్టేట్‌మెంట్ గురించి తెలుసుకునేందుకు ఎస్‌బీఐ క్విక్ బ్యాంకింగ్, SMS బ్యాంకింగ్, మిస్డ్ కాల్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్ ఇలా ఎన్నో రకాలుగా తెలుసుకోవచ్చు. అయితే ఇలా మినీ స్టేట్‌మెంట్ పొందాలంటే.. మీ మొబైల్ నంబర్ బ్యాంక్ అకౌంట్‌తో రిజిస్టరై ఉండాలి. ఈ మినీ స్టేట్‌మెంట్‌లో RTGS, UPI, IMPS, NEFT ఇలా అన్ని రకాల ట్రాన్సాక్షన్స్ కనిపిస్తాయి. 
ఇక బ్యాంక్ మినీ స్టేట్‌మెంట్ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రెండు విధాలుగా పొందొచ్చు.

ఇక SBI బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్, మినీ స్టేట్ మెంట్‌ను వేర్వేరుగా ఒక్కో నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తెలుసుకోవచ్చు. 9223766666 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే.. క్షణాల్లోనే మీ రిజిస్టర్ అయిన మొబైల్ నంబర్‌కు మెసేజ్ వస్తాయి. ఈ నంబర్స్ సేవ్ చేసుకుంటే చాలు. ఎప్పటికీ అవసరం ఉన్నా క్షణాల్లో తెలుసుకోవచ్చు. ఇది టోల్ ఫ్రీ నంబర్. అదనపు ఛార్జీలు ఏం ఉండవు. ఈ నంబర్‌తో మీ అకౌంట్ బ్యాలెన్స్ మెసేజ్ వస్తుంది.

ఇక బ్యాంక్ మినీ స్టేట్‌మెంట్ కావాలంటే 09223866666 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో మీ చివరి 5 ట్రాన్సాక్షన్ల వివరాలు మెసేజ్ రూపంలో అందుతాయి. ఇక్కడ కూడా మీ అకౌంట్ బ్యాలెన్స్ ఎంత ఉందో తెలుస్తుంది.

ఇక మీ నంబర్.. బ్యాంక్ అకౌంట్‌కు లింక్ అయి లేకుంటే.. అలా రిజిస్టర్ చేసుకునే సదుపాయం కూడా ఎస్‌బీఐ ఇప్పుడు కల్పిస్తుంది. అది కూడా ఒక్క మెసేజ్‌తోనే చేసుకోవచ్చు. 
ఇందుకు REG అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి అకౌంట్ నంబర్ ఎంటర్ చేసి 09223488888 నంబర్‌కు మెసేజ్ చేయాలి. అది సక్సెస్ అయితే మీకు మెసేజ్ వస్తుంది. అప్పుడు వారు కూడా పై సేవలను పొందొచ్చు.